Lifestyle: చెవిలో ఎప్పుడు ఏదో ఒకటి పెట్టి తిప్పుతున్నారా.?

|

Nov 02, 2024 | 7:58 PM

చెవిలో గులిమి సర్వసాధారణమైన విషయం. దీంతో చాలా మంది చెవిలో ఏదో ఒక వస్తువు పెట్టి తిప్పుతుంటారు. అయితే దీనివల్ల ఏమాత్రం లాభం ఉండకపోగా నష్టాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ చెవిలో నిత్యం ఏదో ఒకటి పెట్టి తిప్పడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Lifestyle: చెవిలో ఎప్పుడు ఏదో ఒకటి పెట్టి తిప్పుతున్నారా.?
Ear Wax
Follow us on

చెవిలో వేలు, అగ్గిపుల్లలు, పిన్నీసులు లాంటివి పెట్టడం సర్వసాధారణం. మనలో చాలా మంది చేసే పనే ఇది. చెవిలో ఉండే గులిమి తీయటం కోసం ఇలా చేస్తుంటారు. అయితే ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన వస్తువులు ఉన్నా.. చాలా మంది పిన్నిసులు పెడుతుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచి అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటివి ఉపయోగించడం వల్ల గులిమి బయటకు రావడం పక్కన పెడితే.. మరింత లోపలికి వెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

గులిమి చెవి మధ్యలో ఇరుక్కుపోయి మరింత అసౌకర్యం కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో కర్ణభేరికి చిల్లుపడే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది చెవిలో నొప్పితో పాటు ఇన్ఫెక్షన్‌కు దారి తీసే అవకాశం ఉంటుందని అంటున్నారు. దీర్ఘకాలం ఇదే సమస్య కొనసాగితే.. వినికిడీ తగ్గే అవకాశాలు సైతం ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మనలో చాలా మంది గులిమిని తీస్తే చెవి శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు.

నిజానికి ఇది వాస్తవం కాదు. వినికిడి బాగుంటే ఇలాంటి చేయకపోడమే మంచిదని సూచిస్తున్నారు. నిజానికి చెవిలో ఉండే గులిమి చెవి ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది. చెవులు తమకు మాతమే తోడ్పడడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే దుమ్ము, ధూళితో పాటు హానికర వస్తువుల చెవుల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడంలో గులిమి కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. ఒకవేళ చెవిని శుభ్రపరుచుకోవాలనుకున్నా.. డాక్టర్ల పర్యవేక్షణలోనే చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చెవిలోని చర్మం చాలా పలుచగా ఉంటుంది. కాబట్టి పిన్నిసులు లాంటివి పెట్టడం వల్ల పుండ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..