కర్పూరం.. అనగానే మంచి వాసన గుర్తొస్తుంది. కర్పూరం వెలిగించకుండా ఏ పూజా కార్యక్రమం పూర్తి కాదనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హారతి ఇచ్చేందుకు ఉపయోగించే కర్పూరంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతుంటారు. కర్పూరం వాసన పీల్చుకున్నా పలు రకాల అనారోగ్య సమస్యలకు దూరమవుతాయని అంటారు.
అయితే కర్పూరం కలిపిన నీటితో స్నానం చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ కర్పూరం కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చెమట సమస్యతో బాధపడేవారికి కర్పూరం కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి పర్‌ఫ్యూమ్‌లు వాడినా కొద్ది సేపు మాత్రమే వాటి ప్రభావం ఉంటుంది. అలా కాకుండా కర్పూరం కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల రోజంతా తాజాగా ఉండొచ్చు. శరీరం నుంచి వచ్చే చెమట వాసనను దూరం చేయడంలో ఉపయోగపడతుంది.
కర్పూరంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ బయోటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా చర్మంపై వచ్చే దురద, దద్దుర్లు, మొటిమలు వంటి సమస్యలు దూరమవుతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది, ముఖానికి సహజ సౌందర్యం అందిస్తుంది. అలాగే మానసిక సమస్యలతో బాధపడేవారికి కూడా కర్పూరం వాసన ఉపయోగపడుతుంది.
ఒత్తిడితో సతమతమయ్యే వారు స్నానం చేసేప్పుడు.. కర్పూరం కలపాలని చెబుతున్నారు. దీంతో ఒత్తిడి దూరమై, శరీరానికి రిఫ్రెష్ ఇస్తుంది. తలనొప్పి, వెన్నునొప్పితో పాటు ఇతర నొప్పులన్నింటికీ కర్పూరం నీరు బెస్ట్ రెమెడిగా పనిచేస్తుంది. ఒంటి నొప్పులు దూరమవుతాయి. రోజంతా యాక్టివ్‌గా ఉంచడంలో కూడా ఇది ఎంతగానో ఉపయోపగుడుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి…