బ్రష్ చేసే సమయంలో చాలా మందికి చిగుళ్ల నుంచి రక్తం రావడం సర్వసాధారణంగా మారిపోయింది. వినడానికి చిన్న సమస్యే అయినా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందిన నిపుణులు చెబుతుంటారు. చిగుళ్ల నుంచి రక్తం రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోయినా, పళ్లు పుచ్చిపోయినా రక్తసస్రావం అయ్యేందుకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
చిగుళ్లకు ఇన్ఫెక్షన్ సోకినా రక్తస్రావం అవుతుందని అంటున్నారు. అయితే రక్తస్రావాన్ని లైట్ తీసుకుంటే దవడ ఎముకలు కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. దీనిని వైద్య పరిభాషలో జింజువైటిస్ అంటారు. ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువైతే.. ఫిరియాడోంటల్ వ్యాధిగా చెబుతుంటారు. ఈ వ్యాధి కారణంగా చిగుళ్లలో పుండ్లు ఏర్పడతాయి, దంతాలు దూరంగా జరుగుతాయి. బ్రష్ చేసుకున్నప్పుడల్లా చిగుళ్ల నుంచి రక్తం కారుతుందని వైద్యులు చెబుతున్నారు.
స్మోకింగ్ చేసే అలవాటు ఉన్న వారిలో కూడా చిగుళ్ల సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పొగాకులోని నికోటిన్ కారణంగా చిగుళ్ల నుంచి రక్తం వచ్చే అవకాశాలు ఉంటాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అలాగే మధుమేహం, విటమిన్ కె లోపం, గర్భధారణ సమయంలో హార్మోనల్ మార్పులు, లుకేమియా, ఒత్తిడి, హెచ్ఐవి/ఎయిడ్స్ వంటివి కూడా చిగుళ్లలో రక్తస్రావం కావడానికి కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.
రక్తస్రావం తీవ్రంగా ఉన్నా, దీర్ఘకాలంగా సమస్య వేధిస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య బారినపడకుండా ఉండాలంటే నోటిని నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయం, రాత్రి రెండుసార్లు బ్రష్ చేసుకోవాలని చెబుతున్నారు. అలాగే బ్రష్ కచ్చితంగా కనీసం నెలరోజులకు మార్చాలని సూచిస్తున్నారు. సాఫ్ట్ బ్రష్‌ను ఉపయోగించాలి. పళ్లకు బలాన్ని ఇచ్చే క్యాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకోవాలి. అదే విధంగా స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..