వర్షాకాలం వచ్చిందంటే చాలు పచ్చదనంతో నిండిన ప్రకృతి కనులకు విందు చేస్తే .. మేమున్నామంటూ సీజనల్ వ్యాధులు తీవ్ర ఇబ్బందులను కలగజేస్తాయి. ఎప్పుడు కురుస్తుందో తెలియని వానలో తడవడంతో జలుబు, దగ్గు బారిన తరచుగా పడుతూ ఉంటారు. అంతేకాదు రోగ నిరోధక శక్తి తగ్గడంతో జ్వరం వంటి సమస్యలు వస్తాయి. కనుక ఈ సీజన్ లో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. ఇక చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడిగా ఏదైనా తినాలని కోరుకునే వారు కూడా ఎక్కువగానే ఉంటారు. బజ్జీలు, పకోడీలు, మొక్క జొన్న తో పాటు వివిధ రకాల సూప్ లను కూడా తాగుతారు. నాన్ వెజ్ ప్రియులు అయితే చికెన్ సూప్ ని ఇష్టపడతారు. ఇది శరీరానికి శక్తిని, పోషణ అందిస్తుంది. ఈ సీజన్‌లో చికెన్ సూప్ తాగడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇంట్లోనే చాలా ఈజీ చికెన్ సూప్ ను తయారు చేసుకోవచ్చు. ఈ రోజు చికెన్ సూప్ రెసిపీ గురించి తెలుసుకుందాం.
చికెన్ సూప్ తయారీ విధానం: ముందుగా బోన్ లెస్ చికెన్ ను తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గిన్నె వేసుకోవాలి. తర్వాత చికెన్ మునిగేలా నీరు పోసి.. ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టి చికెన్ ముక్కలను బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద బాణలి లేదా మందపాటి గిన్నెను పెట్టి వెలిగించి నూనె వెయ్యాలి. నూనే వేడి ఎక్కిన తర్వాత పచ్చి మిర్చి తరగు, క్యారెట్, బీన్స్, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత అందులో ఉడికించి పక్కకు పెట్టుకున్న చికెన్ ను వేసి చికెన్ లోని నీరుని కూడా పోయాలి. ఇప్పుడు కొంచెం పంచదార, ఉల్లి కాడల ముక్కలు, పాలకూర తరుగు, మిరియాల పొడి.. ఉండలు కట్టడాకుండా కార్న్ ఫ్లోర్ వేసి చికెన్ సహా నీటిని బాగా కలపాలి. ఇపుడు 15 నిమిషాల నుంచి 18 నిమిషాల సేపు ఉడికించాలి. తర్వాత కట్ చేసిన కొత్తిమీరను వేయలి. అంతే వర్షాకాలంలో వేడినిచ్చే చికెన్ సూప్ రెడీ. వేడివేడిగా తాగడం వలన ఆరోగ్య ప్రయోజన్లు ఎన్నో అందిస్తుంది చికెన్ సూప్.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..