AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విటమిన్లు.. మినరల్స్‌కు పవర్‌హౌస్.. ఉదయాన్నే ఇది గిన్నెడు తింటే ఏనుగు లాంటి బలం..

ప్రతిరోజూ ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం శరీరానికి చాలా ముఖ్యం. అనేక సమస్యలకు చెక్ పెట్టి, సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే ఒక అద్భుతమైన అల్పాహారం చద్దన్నం. ఇది కేవలం మిగిలిపోయిన అన్నం కాదు, ప్రత్యేక పద్ధతిలో తయారుచేస్తే అది ఒక ఔషధంలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

విటమిన్లు.. మినరల్స్‌కు పవర్‌హౌస్.. ఉదయాన్నే ఇది గిన్నెడు తింటే ఏనుగు లాంటి బలం..
Chaddannam Easy Recipe
Shaik Madar Saheb
|

Updated on: Sep 14, 2026 | 9:15 PM

Share

ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యకరమైన అల్పాహారం ఎంచుకోవడం ఒక సవాలుగా మారింది. అయితే, మన సాంప్రదాయ వంటకాల్లో ఒకటైన చద్దన్నం (పులియబెట్టిన అన్నం) శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తూ, అనేక ఆరోగ్య సమస్యలను నివారించే అద్భుతమైన శక్తిని కలిగి ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం రుచికరమైన అల్పాహారం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఒక ఔషధంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.

చద్దన్నం (పులియబెట్టిన అన్నం) లో పోషక విలువలు ఎన్నో రెట్లు పెరుగుతాయి. దీనిలో విటమిన్ బి6, విటమిన్ బి12, బి-కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా.. ఖనిజ లవణాలు పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ సాధారణ అన్నంతో పోలిస్తే దాదాపు 15 రెట్లు అధికంగా తయారవుతాయి. పులియబెట్టే ప్రక్రియలో మంచి బ్యాక్టీరియా (ప్రోబయోటిక్స్) అభివృద్ధి చెంది.. జీర్ణ ఆరోగ్యానికి దోహదపడుతుంది.

చద్దన్నం అంటే ఏమిటి?

చద్దన్నం అంటే సాధారణంగా రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని పెరుగులో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం తినడం. అయితే, సంపూర్ణ ప్రయోజనాలు పొందాలంటే దీన్ని ప్రత్యేక పద్ధతిలో తయారుచేసుకోవాలి. అన్నాన్ని (అది బ్రౌన్ రైస్ కావచ్చు లేదా వైట్ రైస్ కావచ్చు) ఉడికించిన తర్వాత, దానిని ఒక మట్టికుండలో వేయాలి. పాలను బాగా కాచి, ఆ వేడి పాలను అన్నంలో పోసి పూర్తిగా కలిపి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత, అందులో కొద్దిగా పెరుగు తోడు పెట్టి, మూత పెట్టి రాత్రంతా (సాధ్యమైనంత వరకు 12 గంటలు) బయట ఉంచాలి. ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఈ ప్రక్రియను సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్య పూర్తి చేస్తే, మరుసటి రోజు ఉదయం నాటికి అది చక్కగా తోడుకొని, పెరుగులా మారుతుంది.

పోషకాలు.. ఆరోగ్య ప్రయోజనాలు:

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది: చద్దన్నంలో లాక్టోబాసిల్లస్ వంటి ప్రోబయోటిక్ బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది మరియు పోషకాల శోషణను పెంచుతుంది. విరేచనాలు, ప్రేగు సంబంధిత ఇన్ఫెక్షన్లను నివారించడంలో కూడా ఇది సహాయపడుతుంది. చాలామంది ఎదుర్కొంటున్న B12 లోపాన్ని నివారించడంలో ఇది సహజమైన మార్గం.

ఎలక్ట్రోలైట్‌లు – శక్తి: చద్దన్నం ఎలక్ట్రోలైట్‌లకు అద్భుతమైన మూలం. ఇది డీహైడ్రేషన్, అలసట, బలహీనతను నివారిస్తుంది. పొటాషియం, సోడియం, క్లోరైడ్, సెలీనియం వంటి ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఉదయం దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

రక్తపోటు – ఎముకల ఆరోగ్యం: చద్దన్నంలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. పాల ద్వారా లభించే కాల్షియం, మెగ్నీషియం, సెలీనియం ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి. మామూలు పాలు తాగే దానికంటే, ఇలా పులియబెట్టిన రూపంలో కాల్షియం శరీరంలోకి వేగంగా శోషించబడుతుంది.

రోగనిరోధక శక్తి: చద్దన్నం రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది, తద్వారా ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల క్యాన్సర్‌లను నివారించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.

బరువు తగ్గడం: ఇతర ఆహారాలతో పోలిస్తే చద్దన్నంలో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి దోహదపడుతుంది.

విటమిన్లు – ఖనిజాలు: ఉల్లిపాయలు కలుపుకోవడం వల్ల సల్ఫర్ కంటెంట్ లభిస్తుంది.. ఇది డయాబెటిస్ నియంత్రణకు సహాయపడుతుంది. పచ్చిమిర్చిలోని క్యాప్సైసిన్ జీవక్రియ రేటును పెంచుతుంది. అల్లం కలిపితే అజీర్ణం, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. కొన్నిసార్లు విటమిన్ సి కూడా ఇందులో ఉత్పత్తి అవుతుంది. మిరియాలు కలుపుకుంటే కాలేయం ఉత్తేజితం అవుతుంది.

నరాల సమస్యలకు పరిష్కారం: నరాలు లాగడం, తిమ్మిర్లు, మంటలు, సమతుల్యత కోల్పోవడం, పార్కిన్సన్స్ వంటి అనేక నరాల సంబంధిత సమస్యలకు చద్దన్నం ఒక చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. శరీరానికి కావాల్సిన అన్ని మినరల్స్, కార్బోహైడ్రేట్లు, కొంత ప్రోటీన్ దీని ద్వారా అందుతాయి.

తినే విధానం:

ఉదయం చద్దన్నం తయారైన తర్వాత, అందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవాలి. కొంతమంది కరివేపాకు, దంచిన మిరియాలు కూడా కలుపుకుంటారు. ఇలా తయారుచేసుకున్న చద్దన్నం చాలా రుచికరంగా ఉంటుంది, మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.

చద్దన్నం సులువుగా ఇంట్లో తయారు చేసుకోగలిగే, ఖర్చు లేని, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అద్భుతమైన అల్పాహారం. ఒకరోజు బ్రౌన్ రైస్‌తో, మరోరోజు వైట్ రైస్‌తో ఇలా మార్చి మార్చి కూడా తయారుచేసుకోవచ్చు. కాబట్టి ఈ అద్భుతమైన ఆహారాన్ని మీ దైనందిన జీవితంలో భాగం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని సూచిస్తున్నారు. అయితే, ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే.. ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us