
ఇంట్లో ఇత్తడి వినాయకుడి విగ్రహాన్ని ఉంచడం వల్ల సానుకూల శక్తి వెలువడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం విగ్రహాన్ని సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. పూజా గది లేదా ఇంటికి ఈశాన్య మూల ఇత్తడి వినాయకుడిని ప్రతిష్టించడానికి అత్యంత పవిత్రమైన స్థానంగా భావిస్తారు.
సరైన దిశ, స్థానం: ఇంట్లో ఇత్తడి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి అత్యంత పవిత్రమైన, ఉత్తమమైన స్థానం ఈశాన్య మూల. ఈ మూలలో విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. విగ్రహాన్ని పూజా గదిలో లేదా హాల్లో ఉంచవచ్చు. విగ్రహం ముఖం ఎప్పుడూ ఉత్తరం దిశను చూస్తున్నట్లు అమర్చుకోవడం చాలా శుభప్రదం.
వినాయకుడి విగ్రహాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు తొండం దిశను గమనించాలి. ఇళ్లలో పూజల కోసం ఎడమవైపుకు తిరిగి ఉన్న తొండం కలిగిన వినాయకుడి విగ్రహాన్ని ఉంచడం మంచిది. ఇది కుటుంబంలో శాంతి, సౌభాగ్యాలను, ఐశ్వర్యాన్ని తెస్తుంది. అలాగే నిలబడి ఉన్న భంగిమ కంటే, పద్మాసనంలో లేదా కూర్చున్న భంగిమలో ఉన్న విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంట్లో స్థిరత్వం, ప్రశాంతత నెలకొంటాయి.
ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఇత్తడి వినాయకుడిని ఉంచడం వల్ల ఎలాంటి దుష్ట శక్తులు లేదా నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకోవచ్చు. దృష్టి దోషాలు తొలగిపోతాయి. అయితే, ఈ విగ్రహాన్ని నేరుగా నేలపై ఉంచకూడదు. ఎప్పుడూ ఒక శుభ్రమైన చెక్క పీఠం లేదా బల్లపైనే ప్రతిష్టించాలి.
ఇత్తడి వినాయకుడి విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బెడ్రూమ్లో లేదా మంచానికి ఎదురుగా ఉంచకూడదు.
బాత్రూమ్, సింక్, మెట్ల కింద లేదా ఇతర అశుభ్రమైన ప్రదేశాల దగ్గర విగ్రహాన్ని పెట్టడం తీవ్రమైన దోషం.
విగ్రహంపై ఎప్పుడూ దుమ్ము, ధూళి పడకుండా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. నిత్యం దీపారాధన చేస్తూ భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఈ నియమాలను పాటిస్తే వినాయకుడి అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..