Kids Habits: మీ పిల్లలను పట్టించుకోవడం లేదా? ఈ చెడు అలవాట్లు త్వరగా నేర్చుకుంటారు జాగ్రత్త!

|

Oct 13, 2024 | 11:29 AM

పిల్లలు పెరుగుతున్నకొద్ది వారిలో మార్పులు వస్తుంటాయి. కొన్ని చెడు అలవాట్లు త్వరగా నేర్చుకుంటారు. పిల్లలు వారు తమ పరిసరాల నుండి అలవాట్లు, ప్రవర్తనలను తెలుసుకోకుండా లేదా అర్థం చేసుకోకుండా గ్రహిస్తారు...

Kids Habits: మీ పిల్లలను పట్టించుకోవడం లేదా? ఈ చెడు అలవాట్లు త్వరగా నేర్చుకుంటారు జాగ్రత్త!
Follow us on

పిల్లలు పెరుగుతున్నకొద్ది వారిలో మార్పులు వస్తుంటాయి. కొన్ని చెడు అలవాట్లు త్వరగా నేర్చుకుంటారు. పిల్లలు వారు తమ పరిసరాల నుండి అలవాట్లు, ప్రవర్తనలను తెలుసుకోకుండా లేదా అర్థం చేసుకోకుండా గ్రహిస్తారు.

చాలా సార్లు పిల్లలు చూసేది, వినేది వారికి అలవాటు అవుతుంది. వారు మంచి, చెడు కూడా కావచ్చు. అటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతి చిన్న విషయానికి శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. పిల్లవాడు ఏదైనా తప్పు నేర్చుకుంటున్నట్లయితే, ఈ అలవాటు నుండి బయటపడటానికి ప్రయత్నించాలి. లేకుంటే తల్లిదండ్రులు మున్ముందు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. పిల్లలు చాలా వేగంగా నేర్చుకునే అలాంటి 5 చెడు అలవాట్ల గురించి తెలుసుకుందాం.

  1. తప్పును అంగీకరించకపోవడం – చాలా సార్లు పిల్లలు సిగ్గుతో లేదా శిక్షిస్తారోమోనన్న భయంతో తమ తప్పును అంగీకరించరు. పిల్లవాడు చేసిన తప్పుకు బాధ్యత వహించకపోతే, అది అబద్ధం వంటి అనేక పెద్ద సమస్యలకు దారి తీస్తుంది. పిల్లవాడు ఎలాంటి భయం లేకుండా తన తప్పును ఒప్పుకునేలా చేయడం చాలా ముఖ్యం.
  2. విషయాలను వాయిదా వేయడం – పిల్లలు చాలా త్వరగా నేర్చుకునే అలవాటు ఉంటుంది. అది హోంవర్క్ లేదా ఇంటి పనులు కావచ్చు. ఎలాంటి విషయాలనైనా నేర్చుకున్నారంటే వాటిని వదిలించుకోవడం వారికి కష్టమే. పిల్లల ముందు తల్లిదండ్రులు మాట్లాడే విధానంపై కూడా ఆధార పడి ఉంటుంది. తల్లిదండ్రులు ఎవరితోనైనా చెడుగా మాట్లాడినట్లయితే అలాంటి అలవాట్లు వారు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లల ముందు ఏది పడితే అది మాట్లాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల పిల్లలు చేజారిపోయే ప్రమాదం ఉందంటున్నారు.
  3. కబుర్లు చెప్పుకోవడం- పిల్లలు తమ సొంత కుటుంబం గురించి కబుర్లు చెప్పుకోవడం అలవాటుగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో పిల్లవాడు మీ చుట్టూ ఉన్నట్లయితే, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. మీరు ఇతరులతో మాట్లాడే మాటలను బట్టి వారు త్వరగా నేర్చుకుంటారు.
  4. పరిశుభ్రత- పరిశుభ్రతతో జీవించడం చాలా తేలికగా అనిపించినప్పటికీ, పిల్లవాడు పెద్దయ్యాక శుభ్రతతో జీవించనప్పుడు, దాని ప్రాముఖ్యతను గ్రహిస్తాడు. తినే ముందు చేతులు కడుక్కోవడం, పళ్లు తోముకోవడం మొదలైన చిన్న చిన్న విషయాలు శ్రద్ద వహించేలా తల్లిదండ్రులు ముందు నుంచి నేర్పించడం చాలా ముఖ్యం. అలా అలవాటు పడితే ఎప్పుడు కూడా పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తుంటారు.
  5. పిల్లలను మొబైల్‌ఫోన్‌లకు దూరంగా ఉంచడం మంచిది. ఫోన్‌లు ఎక్కువగా అలవాటు పడితే వారి ప్రవర్తనలో మార్పులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు ఒక్కసారి ఫోన్‌కు అలవాటు పడితే తల్లిదండ్రులు చెప్పే మాటలు కూడా వినరు. మీరు ఏది చెప్పిన పెడచెవిన పెడుతుంటారు. అందుకే మొబైల్‌ ఫోన్‌ల వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయని నిపుణులు పదేపదే హెచ్చరిస్తుంటారు. ఫోన్‌ల వాడకం వారి శరీరంపై చాలా ప్రభావం పడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి