విశాఖకు భారీగా పెట్టుబడులు !

|

Sep 17, 2020 | 3:33 PM

విశాఖ  నౌకాశ్రయంలో 4095 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ మెంట్స్ పెట్టడంతో పాటు, మూడేళ్లలో షిప్ యార్డ్ సామర్థ్యంను 141.64 మిలియన్‌ టన్నులకు అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర షిప్పింగ్  మంత్రిత్వ శాఖ తెలిపింది.

విశాఖకు భారీగా పెట్టుబడులు !
Follow us on

విశాఖ  నౌకాశ్రయంలో 4095 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ మెంట్స్ పెట్టడంతో పాటు, మూడేళ్లలో షిప్ యార్డ్ సామర్థ్యంను 141.64 మిలియన్‌ టన్నులకు అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర షిప్పింగ్  మంత్రిత్వ శాఖ తెలిపింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు పరిమల్‌ నత్వానీ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం చెప్పింది. కాగా ప్రస్తుతం నౌకాశ్రయ సామర్థ్యం  126.89 మిలియన్‌ టన్నుల ఉండగా, 2023 ఆర్థిక సంవత్సరం నాటికి  141.64 మిలియన్‌ టన్నులకు వృద్ధి చేయనున్నట్లు వివరించింది.

కేంద్ర మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం విశాఖపట్నం పోర్ట్‌ ట్రస్ట్‌ ఇందుకు సంబంధించి ప్లానింగ్ రూపొందించింది. ఛానెల్స్‌, బెర్త్‌లను మరింత లోతుగా విస్తరించడం ద్వారా అంతర్గత వనరుల నుంచి సైతం నిధులను సమకూర్చుకోవచ్చని మంత్రి వెల్లడించారు. ఇక వైజాగ్ షిప్ యార్డులో బెర్త్‌ల ఆధునీకరణ , సామర్ధ్య విస్తరణకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యల వివరాలు తెలుపాల్సిందిగా ఎంపీ నత్వానీ కోరారు. నత్వాని ప్రశ్నకు కేంద్ర మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 12 ప్రాజెక్టులలో 3086 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నామని వివరించారు. వీటిలో ఎక్కువ పెట్టుబడి పెడుతోన్న 633.11 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇప్పటికే నిర్మాణంలో ఉందని తెలిపారు.

Also Read :

ఒక్క రోజులో రేషన్ కార్డ్, జగన్ సర్కార్ నయా రికార్డ్

విశాఖ మణ్యంలో అంతు చిక్కని వ్యాధి, గిరిజనులు మృతి

ప్రాణాలు నిలిపిన డాక్టర్లకు ఆ వృద్ధ రైతు పంపిన గిఫ్ట్ ఏంటో తెలుసా?