రాజధాని రగడ.. ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

ఏపీలో మూడు రాజధానుల అంశంపై ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్న తరుణంలో.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం, పాలనా యంత్రాంగం, హైకోర్టు, అసెంబ్లీ అన్నీ ఒక్కచోటే ఉండాలన్నారు. అన్ని ఒకచోట ఉంటేనే పాలనలో సౌలభ్యం ఉంటుందని.. ఈ విషయాన్ని రాజకీయ కోణంలో.. వివాదాస్పదంగా చూడొద్దన్నారు. తన 42 ఏళ్ళ సుదీర్ఘ అనుభవంతో ఈ మాట చెపుతున్నానన్నారు. ఆత్కూర్ స్వర్ణభారత్‌ ట్రస్ట్ర్‌లో మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధానుల అంశంపై కేంద్రం […]

రాజధాని రగడ.. ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: Dec 25, 2019 | 10:39 AM

ఏపీలో మూడు రాజధానుల అంశంపై ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్న తరుణంలో.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం, పాలనా యంత్రాంగం, హైకోర్టు, అసెంబ్లీ అన్నీ ఒక్కచోటే ఉండాలన్నారు. అన్ని ఒకచోట ఉంటేనే పాలనలో సౌలభ్యం ఉంటుందని.. ఈ విషయాన్ని రాజకీయ కోణంలో.. వివాదాస్పదంగా చూడొద్దన్నారు. తన 42 ఏళ్ళ సుదీర్ఘ అనుభవంతో ఈ మాట చెపుతున్నానన్నారు. ఆత్కూర్ స్వర్ణభారత్‌ ట్రస్ట్ర్‌లో మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధానుల అంశంపై కేంద్రం తన అభిప్రాయాన్ని తీసుకుంటే ఇదే విషయాన్ని చెప్తానన్నారు. అంతేకాదు.. అన్ని జిల్లాల్లో కేంద్ర సంస్థల్ని ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధి వికేంద్రీకరించి.. పాలన కేంద్రీకృతం కావాలన్నదే నా అభిప్రాయమన్నారు వెంకయ్యనాయుడు.