అండర్ 19 వరల్డ్‌కప్: ఫైనల్‌‌లో టీమిండియా.. పాకిస్థాన్‌పై అద్భుత విజయం

U19 World Cup: పాకిస్థాన్‌తో జరుగుతున్న అండర్ 19 వరల్డ్‌కప్ సెమీఫైనల్స్‌లో యువ భారత్ అదరగొట్టింది. దాయాది జట్టు పాకిస్థాన్‌పై 10 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.  మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ టీమ్ ఇండియా బౌలర్ల ధాటికి కేవలం 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ బౌలర్లు సుశాంత్‌ మిశ్రా(3), కార్తిక్‌ త్యాగి(2), రవి బిష్ణోయ్‌(2)లు చెలరేగిపోయారు. ఇక 173 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆడుతూ పాడుతూ వికెట్ నష్టపోకుండానే ఛేదించింది. […]

అండర్ 19 వరల్డ్‌కప్: ఫైనల్‌‌లో టీమిండియా.. పాకిస్థాన్‌పై అద్భుత విజయం

U19 World Cup: పాకిస్థాన్‌తో జరుగుతున్న అండర్ 19 వరల్డ్‌కప్ సెమీఫైనల్స్‌లో యువ భారత్ అదరగొట్టింది. దాయాది జట్టు పాకిస్థాన్‌పై 10 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.  మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ టీమ్ ఇండియా బౌలర్ల ధాటికి కేవలం 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ బౌలర్లు సుశాంత్‌ మిశ్రా(3), కార్తిక్‌ త్యాగి(2), రవి బిష్ణోయ్‌(2)లు చెలరేగిపోయారు.

ఇక 173 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆడుతూ పాడుతూ వికెట్ నష్టపోకుండానే ఛేదించింది. ఓపెనర్ జైస్వాల్(105) సెంచరీతో అదరగొట్టగా.. మరో బ్యాట్స్‌‌మెన్ సక్సేనా(59) అర్ధ సెంచరీతో రాణించాడు. ఇక ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన భారత్ సరాసరి ఫైనల్స్‌కు చేరుకుంది. కాగా, టీమిండియా ఫీల్డింగ్‌లోను మంచి ప్రదర్శన కనబరించిందని చెప్పాలి.

Published On - 7:50 pm, Tue, 4 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu