గుడ్ న్యూస్: ఔట్‌సోర్సింగ్‌ నర్సుల జీతాలు పెంపు..!

| Edited By:

Aug 11, 2020 | 11:10 AM

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికోసం తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. కరోనా కాలంలో ధైర్యంగా విధులు నిర్వర్తిస్తున్న ఔట్‌సోర్సింగ్‌ నర్సింగ్‌ సిబ్బంది జీతాలను ప్రభుత్వం పెంచింది.

గుడ్ న్యూస్: ఔట్‌సోర్సింగ్‌ నర్సుల జీతాలు పెంపు..!
Follow us on

TS Outsourcing nurses salary hiked: దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికోసం తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. కరోనా కాలంలో ధైర్యంగా విధులు నిర్వర్తిస్తున్న ఔట్‌సోర్సింగ్‌ నర్సింగ్‌ సిబ్బంది జీతాలను ప్రభుత్వం పెంచింది. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోని నర్సింగ్‌, నిమ్స్‌ దవాఖానల్లో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలు రూ.17,500 నుంచి రూ.25,140కు పెరిగాయి. కొవిడ్‌ విధి నిర్వహణలో సిబ్బంది మరింత చురుకుగా పనిచేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఔట్‌సోర్సింగ్‌ నర్సింగ్‌ సిబ్బంది హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌, మంత్రి ఈటలకు కృతజ్ఞతలు తెలిపారు.

Read More: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై పీహెచ్‌సీల్లో 24 గంటల సేవలు..