డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అదే పాట ! ‘బైడెన్ పై నా ఓటమిని 99 శాతం మంది ఒప్పుకోవడం లేదు’

అమెరికా ఎన్నికల్లో జో బైడెన్ పై తన ఓటమిని 99 శాతం మంది ప్రజలు అంగీకరించడం లేదని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. పోల్ రిజల్ట్స్ ని బట్టి చూస్తే ఈ విషయం అర్థమవుతోందన్నారు.

డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అదే పాట ! 'బైడెన్ పై నా ఓటమిని 99 శాతం మంది ఒప్పుకోవడం లేదు'
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 25, 2020 | 10:50 AM

అమెరికా ఎన్నికల్లో జో బైడెన్ పై తన ఓటమిని 99 శాతం మంది ప్రజలు అంగీకరించడం లేదని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. పోల్ రిజల్ట్స్ ని బట్టి చూస్తే ఈ విషయం అర్థమవుతోందన్నారు. నేను ఓటమిని ఒప్పుకోవాలా వద్దా అన్న విషయంలో అభిప్రాయ సేకరణ చేస్తే వద్దనే 99 శాతం మంది స్పష్టం చేశారని, కేవలం 1.1 శాతం మంది మాత్రమే అంగీకరించాలంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో పెద్దఎత్తున ఫ్రాడ్ జరిగిందని ట్రంప్ ప్రచార వర్గం ఇప్పటికీ ఆరోపిస్తోంది. మరోవైపు వైట్ హౌస్ లో జో బైడెన్ ప్రవేశానికి మెల్లగా మార్గం సుగమమవుతోంది. ట్రంప్ నుంచి అధికార మార్పిడికి రంగం సిధ్దమవుతోంది. తన ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఆంటోనీ బ్లింకెన్ ని బైడెన్ అప్పుడే నియమించారు. ఇక దేశాధ్యక్షునిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ జనవరి 20 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ట్రంప్ మళ్ళీ పాత పాటనే పాడడం విశేషం.

Latest Articles