మార్కెటింగ్ ప్రమోషన్ పేరిట వస్తోన్న కాల్స్ వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నిత్యం ఫోన్లు వస్తూనే ఉంటాయి. చాలా మంది మాకొద్దు.. బిజీగా ఉన్నామని చెబుతున్న పదేపదే ఫోన్ చేస్తూ విసిగిస్తుంటారు. ఇది ఏ ఒక్కరి సమస్య మాత్రమే కాదు. కొన్ని సందర్భాల్లో ఆగ్రహావేశాలతో వారిని తిట్టినంత పని చేస్తుంటారు. తరచూ ఫోన్లు వస్తున్నాయంటూ ప్రతి ఫోన్ కాల్‌ను బ్లాక్ చేసుకుంటూ వెళ్లినా లాభం లేకుండా పోతోందని మరికొందరి వాదన. ఒక ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేస్తే మరో నెంబర్ నుంచి కాల్ చేసి వేధిస్తుంటారు. అలా బ్లాక్ అయిన చాలా కాల్స్ స్పామ్ (రెడ్ కలర్)లో ప్రత్యక్షం అవుతుండటంతో వెంటనే కట్ చేయడానికి కూడా కొన్ని సార్లు అవకాశముండదని కొందరు చెబుతున్నారు.
బ్లాక్ అయిన చాలా కాల్స్ స్పామ్ కాల్స్ పై ప్రముఖ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ షాకింగ్ విషయాలను వెల్లడించింది. గతేడాది భారతదేశంలో ఈ యాప్ వినియోగించే వారికి కేవలం 2019లోనే 29,700 కోట్ల స్పామ్ కాల్స్, 8,500 కోట్ల స్పామ్ మెసేజ్ లు వచ్చినట్లు కంపెనీ గుర్తించింది. దీని కోసం తమ ఆండ్రాయిడ్ యూజర్లకు ట్రూకాలర్ ఒక కొత్త ఫీచర్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా తమ వినియోగదారులకు స్పామ్ యాక్టివిటీని గురించి అవగాహన కల్పిస్తుంది. ట్రూకాలర్ కు ప్రస్తుతం మన దేశంలో 17 కోట్ల మంది నెలవారీ యూజర్లున్నారు. స్పామ్ కాల్స్ విషయంలో మనదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానంలో కొనసాగుతుండగా.. స్పామ్ మెసేజ్ ల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదో స్థానంలోనూ మనదేశం ఉన్నట్లు ట్రూకాలర్ పేర్కొంది.
Caller identification app Truecaller on Wednesday said that it identified 29.7 billion spam calls and 8.5 billion spam SMS for its users in India last year.https://t.co/RlWqUlqBRr
— The Hindu (@the_hindu) August 19, 2020