డ్రైవరన్న జర భద్రం..లుంగీతో బండి నడిపితే ఫైన్ తప్పదట!

డ్రైవరన్న జర భద్రం..లుంగీతో బండి నడిపితే ఫైన్ తప్పదట!
Uttar Pradesh: Truck drivers wearing ‘lungi’ and vest will now be fined Rs 2000

కొత్త మోటార్ వెహికల్ సవరణ చట్టం వచ్చిన తర్వాత పోలీసులు నిబంధనలు పాటించని వాహన డ్రైవర్ల బెండు తీస్తున్నారు. భారీ స్థాయిలో ఫైన్లు వేస్తూ బండి బయటకు తీయాలంటే భయపడేలా చేస్తున్నారు. వీటితోనే తీవ్ర సమస్యలను ఎదుర్కుంటుంటే..లారీలు, ట్రక్కుల డ్రైవర్లకు మరో చిక్కొచ్చిపడింది. ధరించే దుస్తుల విషయంలో కూడా క్రమశిక్షణ లేకపోతే ఫైన్లు వేస్తున్నారు పోలీసులు.  లుంగీలు, బనియన్లతో లారీ నడిపితే ఉత్తరప్రదేశ్ ట్రాఫిక్ పోలీసులు ఏకంగా రూ.2వేలు జరిమానా విధిస్తున్నారు.  కాళ్లకు బూట్లను సైతం ధరించాలని […]

Ram Naramaneni

|

Sep 10, 2019 | 1:20 AM

కొత్త మోటార్ వెహికల్ సవరణ చట్టం వచ్చిన తర్వాత పోలీసులు నిబంధనలు పాటించని వాహన డ్రైవర్ల బెండు తీస్తున్నారు. భారీ స్థాయిలో ఫైన్లు వేస్తూ బండి బయటకు తీయాలంటే భయపడేలా చేస్తున్నారు. వీటితోనే తీవ్ర సమస్యలను ఎదుర్కుంటుంటే..లారీలు, ట్రక్కుల డ్రైవర్లకు మరో చిక్కొచ్చిపడింది. ధరించే దుస్తుల విషయంలో కూడా క్రమశిక్షణ లేకపోతే ఫైన్లు వేస్తున్నారు పోలీసులు.  లుంగీలు, బనియన్లతో లారీ నడిపితే ఉత్తరప్రదేశ్ ట్రాఫిక్ పోలీసులు ఏకంగా రూ.2వేలు జరిమానా విధిస్తున్నారు.  కాళ్లకు బూట్లను సైతం ధరించాలని చెప్తున్నారు. ఇప్పటికే చాలామందికి ఈ కోటాలో జరిమానాలు విధించడంతో షాక్ గురవ్వడం డ్రైవర్ల వంతయ్యింది.

లారీలు, ట్రక్‌లు నడిపే డ్రైవర్లు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని యూపీ పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. లుంగీ, బనియన్‌తో డ్రైవింగ్ చేస్తే జరిమానాలు తప్పవని స్పష్టంచేశారు. లారీ డ్రైవర్లు ఖచ్చితంగా ప్యాంట్, షర్ట్ లేదంటే టీ షర్ట్ వేసుకొని డ్రైవింగ్ చేయాలని.. లేదంటే ఫైన్ పడుతుందని తెలిపారు. స్కూలు వ్యాన్ డ్రైవర్లు, ప్రభుత్వ వాహనాలకూ ఈ నిబంధనలు వర్తిస్తుందని చెప్పారు. డ్రైవర్లు సరైన దుస్తులు ధరించాలని 1939 వాహన చట్టంలోనే పోలీసులు చెప్పడం గమనార్హం.

కేంద్రం నూతన వాహన చట్టం సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అధికారులు జరిమానాలు విధిస్తున్నారు. జనం నుంచి ఎన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నా ఫైన్ల విషయంలో ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గట్లేదు. డబ్బ కంటే ప్రాణం ఇంపార్టెంట్ అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మరోసారి స్పష్టం చేశారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu