GHMC Elections Results 2020 : గ్రేటర్ ఫలితాల్లో కారుదే అగ్రస్థానం.. రెండో స్థానానికి దూసుకొచ్చిన కమలం.. ఎంఐఎంకు స్వల్ప నష్టం!

| Edited By: Venkata Narayana

Dec 04, 2020 | 9:48 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. కారుకు బ్రేకులు వేయడానికి కమలం విశ్వ ప్రయత్నం చేస్తోంది.

GHMC Elections Results 2020 : గ్రేటర్ ఫలితాల్లో కారుదే అగ్రస్థానం.. రెండో స్థానానికి దూసుకొచ్చిన కమలం.. ఎంఐఎంకు స్వల్ప నష్టం!
Follow us on

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. కారుకు బ్రేకులు వేయడానికి కమలం విశ్వ ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఎల్బీ‌నగర్ నియోజకవర్గంలో ఏకంగా 11 డివిజన్‌లో విజయకేతనం ఎగరేసి క్లీన్‌స్వీప్ చేసింది. అమీర్‌పేట డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిపై 1301 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి సరళ గెలుపు సాధించింది. బీజేపీకి 8947 ఓట్లు రాగా, టీఆర్ఎస్‌కు 7646 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 489 ఓట్లు రాగా, టీడీపీకి 771 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థికి 24 ఓట్లు రాగా, నోటాకు 154 ఓట్లు వచ్చాయి. ఇంకా 358 ఓట్లు రిజెక్ట్ అయ్యాయి. బీజేపీ గెలవడంతో పార్టీ శ్రేణలు బాణాసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకుంటున్నారు.

GHMC Election Result 2020 Live Update : కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం

GHMC Election Results 2020: Full list of winning candidates : గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే, బ్యాక్ టూ బ్యాక్ అప్‌డేట్స్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..