పాకిస్తాన్‌లో కొనసాగుతున్న ఆలయాల విధ్వంసం

భారత్‌కు పక్కలో బల్లెంలా మారిన పాకిస్తాన్‌ దేశంలో మైనారిటీలకు రక్షణ లేకుండా పోతోంది. మరీ ముఖ్యంగా హిందూ దేవాలయాల విధ్వంసం చేస్తూ మైనారిటీలను హడలెత్తిస్తున్నారు. తాజాగా...

పాకిస్తాన్‌లో కొనసాగుతున్న ఆలయాల విధ్వంసం
Follow us

|

Updated on: Oct 11, 2020 | 1:12 PM

Temples distruction in Pakistan: భారత్‌కు పక్కలో బల్లెంలా మారిన పాకిస్తాన్‌ దేశంలో మైనారిటీలకు రక్షణ లేకుండా పోతోంది. మరీ ముఖ్యంగా హిందూ దేవాలయాల విధ్వంసం చేస్తూ మైనారిటీలను హడలెత్తిస్తున్నారు. తాజాగా సింధ్ ప్రావిన్స్‌లోని బదిన్ సింద్ పాకిస్తాన్ ఏరియాలో వున్న శ్రీ రామ్ మందిర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసం చేశారు. బదిన్ ప్రావిన్స్‌లోని కరియో ఘన్వర్ ప్రాంతంలో ఈ మందిరం వుండేది. అక్టోబర్ 10వ తేదీ రాత్రి కొందరు దుండగులు ఈ మందిరాన్ని కూల్చి వేశారు.

శ్రీరామ్ మందిర్ కూల్చివేతను పాకిస్తాన్‌లో మైనారిటీల హక్కుల కోసం పోరాడుతున్న అనిలా గుల్జార్ ఫేస్‌బుక్ వేదికగా ధృవీకరించారు. పాకిస్తాన్‌ వ్యాప్తంగా మొత్తం 428 హిందూ దేవాలయాలుండగా.. వాటి సంఖ్య ఇపుడు 20కి పడిపోయిందని, దేవాలయాల విధ్వంసం కొనసాగుతూనే వుందని ఆమె పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో హిందువులు అతిపెద్ద మైనారిటీ వర్గం కాగా.. వారికి సంబంధించిన దేవాలయాలపైనే దాడులు కొనసాగుతున్నాయి. దీనిపై అక్కడి హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా అక్కడి ప్రభుత్వాలు, పాలకులు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు.

Also read: దుబ్బాక విజయంలో ఆ వర్గాలే కీలకం