దసరాకు ముహూర్తం.. ధరణి పోర్టల్ ప్రారంభం..

|

Sep 26, 2020 | 7:18 PM

Dharani Portal Telangana: దసరా పండుగ రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా ధరణి పోర్టల్ ప్రారంభించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, బ్యాండ్ విడ్త్‌లను సిద్ధం చేయాలని చెప్పారు. మారిన రిజిస్ట్రేషన్ విధానం, వెంటనే మ్యుటేషన్ చేయడం, ధరణి పోర్టల్‌కు వివరాలను అప్‌డేట్ చేయడం వంటి తదితర అంశాలపై, విధివిధానాలపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్‌లకు అవసరమైన శిక్షణ ఇవ్వనున్నట్లు […]

దసరాకు ముహూర్తం.. ధరణి పోర్టల్ ప్రారంభం..
Follow us on

Dharani Portal Telangana: దసరా పండుగ రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా ధరణి పోర్టల్ ప్రారంభించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, బ్యాండ్ విడ్త్‌లను సిద్ధం చేయాలని చెప్పారు. మారిన రిజిస్ట్రేషన్ విధానం, వెంటనే మ్యుటేషన్ చేయడం, ధరణి పోర్టల్‌కు వివరాలను అప్‌డేట్ చేయడం వంటి తదితర అంశాలపై, విధివిధానాలపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్‌లకు అవసరమైన శిక్షణ ఇవ్వనున్నట్లు సీఎం వెల్లడించారు.

ప్రతీ మండలానికి ఒకరు చొప్పున, అలాగే ప్రతీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకరు చొప్పున కంప్యూటర్ ఆపరేటర్ల నియామకాన్ని పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ధరణి పోర్టల్ ప్రారంభం కావడానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నెంబర్ల వారీగా రిజిస్ట్రేషన్ రేట్లను నిర్ణయించనున్నట్లు ఆయన తెలిపారు. అదే రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. దసరాలోగా అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన డేటాను ధరణి పోర్టల్‌లో ఎంటర్ చేయాలని అధికారులను కోరారు. దాని బట్టే ఆ తర్వాత జరిగే మార్పులు చేర్పులు వెంటవెంటనే నమోదు చేయడం జరుగుతుందని సీఎం చెప్పరు. కాగా, దసరా రోజు నుంచే పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమవుతాయన్నారు.

Also Read:

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..

కరోనాపై ఎస్పీ బాలు చివరి పాట.. ఎంత మధురంగా పాడారంటే.!

సెప్టెంబర్ 25.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్లాక్ డే..