IPS Officers: తెలంగాణ‌కు న‌లుగురు… ఆంధ్ర‌కు ముగ్గురు ఐపీఎస్ ఆఫీస‌ర్ల కేటాయింపు…

కేంద్ర ప్ర‌భుత్వం దేశ వ్యాప్తంగా 150 మంది ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌కు పోస్టింగ్‌లు ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల‌కు 7గురు ఐపీఎస్ అధికారుల‌ను...

  • Tv9 Telugu
  • Publish Date - 1:30 pm, Wed, 20 January 21
IPS Officers: తెలంగాణ‌కు న‌లుగురు... ఆంధ్ర‌కు ముగ్గురు ఐపీఎస్ ఆఫీస‌ర్ల కేటాయింపు...

కేంద్ర ప్ర‌భుత్వం దేశ వ్యాప్తంగా 150 మంది ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌కు పోస్టింగ్‌లు ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల‌కు 7గురు ఐపీఎస్ అధికారుల‌ను కేటాయించింది. తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం న‌లుగురు ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌ను, ఆంధ్ర‌కు ముగ్గురు ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌కు పోస్టింగ్ ఇచ్చింది.

తెలంగాణకు కేటాయించ‌బ‌డిన‌ ఐపీఎస్ అధికారులు వీరే…

ప‌రితోష్ పంక‌జ్‌(ర్యాంకు 142, బీహార్‌)
సిరిశెట్టి సంకీత్‌(ర్యాంకు 330, తెలంగాణ‌)
పాటిల్ కాంతిలాల్ సుభాష్‌(ర్యాంకు 418, మ‌హారాష్ర్ట‌)
అంకిత్ కుమార్ శంక్వార్‌(ర్యాంకు 563, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌)

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కేటాయించ‌బ‌డిన ఐపీఎస్ అధికారులు వీరే…

అడ‌హ‌ల్లి(ర్యాంకు 440, క‌ర్ణాట‌క‌)
పంక‌జ్ కుమార్ మీనా(ర్యాంకు 666, రాజ‌స్థాన్‌)
ధీర‌జ్ కునుబిల్లి(ర్యాంకు 320, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌)

కాగా తెలంగాణ నుంచి ఐపీఎస్‌కు ఎంపికైన ఎంవీ స‌త్య‌సాయి కార్తీక్‌(ర్యాంకు 103)ను మ‌హారాష్ర్ట‌కు, షీత‌ల్ కుమార్‌(ర్యాంకు 417)ను అసోంకు, రాజ‌నాల స్మృతిక్‌(ర్యాంకు 466)ను ఛ‌త్తీస్‌గ‌ఢ్‌కు పోస్టింగ్ పొందారు.

 

ALSO READ: Telangana Corona Update: తెలంగాణలో పెరిగిన కరోనా కేసుల సంఖ్య.. 24 గంట‌ల్లో న‌మోదైన మ‌ర‌ణాలు ఎన్నంటే..?