అంతర్రాష్ట్ర సర్వీసులపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..

|

Jun 10, 2020 | 2:13 PM

కరోనా తీవ్రత దృష్ట్యా హైదరాబాద్‌లో సిటీ బస్సు సర్వీసులను ఇప్పట్లో పునరుద్దరించే అవకాశం లేదని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఎయిర్‌పోర్ట్‌ సర్వీసులను కూడా నడపవద్దని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

అంతర్రాష్ట్ర సర్వీసులపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..
Follow us on

కరోనా తీవ్రత దృష్ట్యా హైదరాబాద్‌లో సిటీ బస్సు సర్వీసులను ఇప్పట్లో పునరుద్దరించే అవకాశం లేదని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఎయిర్‌పోర్ట్‌ సర్వీసులను కూడా నడపవద్దని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సుమారు 5 గంటల పాటు ఆర్టీసీపై సమీక్ష నిర్వహించిన ఆయన పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాకే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను అనుమతించాలన్నారు.

ఇప్పటివరకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందం మేరకు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు అంతర్రాష్ట్ర బస్సులు నడిచాయి. అయితే ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన నేపధ్యంలో తాజాగా ఏపీతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో కొత్త ఒప్పందం కుదుర్చుకున్నాకే అంతర్రాష్ట్ర బస్సులను నడపాలని సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆయా రాష్ట్రాల నుంచి కేటగిరీలు వారీగా(ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, లగ్జరీ, సూపర్‌ లగ్జరీ, వోల్వో) బస్సులు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాయో.. తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా ఆయా రాష్ట్రాల్లో అన్ని కిలోమీటర్ల మేరకు తిరిగేలా పకడ్బందీగా ఒప్పందం కుదుర్చుకోవాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

Also Read: 

జగన్ కీలక నిర్ణయం.. త్వరలోనే వైద్యశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.!

దసరా వరకు స్కూల్స్ తెరిచే ప్రసక్తి లేదు..!

కిమ్‌శకం ఇక ముగిసినట్లేనా.? ఆ ఇద్దరిలో ఒకరికి పగ్గాలు.!