తెలంగాణలోను కమలంతో కల్యాణం

పార్టీల మధ్య పొత్తు కుదిరితే..దాని ఎఫెక్ట్ చాలా అంశాలపై పడుతుంది. కలిసి నడుద్దాం అని ఆ పార్టీలు రెండు నిర్ణయించాయి. అయితే ఈ దోస్తీ ఏపీకి మాత్రమే పరిమితమవుతుందా? తెలంగాణ కూడా వర్తిస్తుందా? అనే చర్చ మొదలైంది. బీజేపీ, జనసేన తెలంగాణలో కూడా కలిసి వడుస్తాయా? లేదా? ఇదిప్పుడు తెలంగాణలో జోరందుకున్న చర్చ. ఏపీలో బీజేపీ జనసేన కలిసి నడుస్తున్నాయి. ఇప్పటికే సమీక్ష సమావేశాలు జరిగాయి. ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ రెడీ అవుతోంది. రెండు పార్టీలు కలిసి […]

తెలంగాణలోను కమలంతో కల్యాణం
Follow us

|

Updated on: Feb 01, 2020 | 10:59 AM

పార్టీల మధ్య పొత్తు కుదిరితే..దాని ఎఫెక్ట్ చాలా అంశాలపై పడుతుంది. కలిసి నడుద్దాం అని ఆ పార్టీలు రెండు నిర్ణయించాయి. అయితే ఈ దోస్తీ ఏపీకి మాత్రమే పరిమితమవుతుందా? తెలంగాణ కూడా వర్తిస్తుందా? అనే చర్చ మొదలైంది. బీజేపీ, జనసేన తెలంగాణలో కూడా కలిసి వడుస్తాయా? లేదా? ఇదిప్పుడు తెలంగాణలో జోరందుకున్న చర్చ.

ఏపీలో బీజేపీ జనసేన కలిసి నడుస్తున్నాయి. ఇప్పటికే సమీక్ష సమావేశాలు జరిగాయి. ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ రెడీ అవుతోంది. రెండు పార్టీలు కలిసి ప్రజాసమస్యలపై పోరాటానికి రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే కొంత కార్యాచరణ ప్రకటించారు.

ఏపీలో పవన్‌ కల్యాణ్‌ ఒక స్టాండ్‌ తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దూకుడుగా వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీతో జత కలిశారు. దీంతో ఉమ్మడి కార్యాచరణ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. వైసీపీ సర్కార్‌ తీసుకనే నిర్ణయాలపై తన స్టాండ్‌ ఏంటో పవన్‌కు అక్కడ క్లియర్‌ పిక్చర్‌ ఉంది. అయితే ఇప్పుడు తెలంగాణలో పవన్‌కు సమస్య వచ్చిపడింది. ఇక్కడ కేసీఆర్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా ఆయన బీజేపీ స్టాండ్‌లో వెళతారా? లేదా? అనేది పెద్ద ప్రశ్న.

తెలంగాణలో కూడా జనసేనతో కలిసి నడిచేందుకు బీజేపీ రెడీ అవుతోంది. త్వరలోనే పవన్‌ కల్యాణ్‌తో భేటీ అవుతామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రకటించారు. దీంతో పవన్‌ తెలంగాణ పాలిటిక్స్‌లో కూడా ఎంట్రీ ఖాయమని తెలుస్తోంది. దీంతో బీజేపీ స్టాండ్‌కు అనుగుణంగా జనసేనాని కూడా టీఆర్‌ఎస్‌ వ్యతిరేక స్ఠాండ్‌ తీసుకుంటారా? తనదైన శైలిలో కేసీఆర్‌ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ రాజకీయాలను ఇన్నాళ్లు పవన్‌ దూరంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. ఆంధ్ర రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు బీజేపీతో దోస్తీ ద్వారా తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌పై ఆయన వైఖరి ఎలా ఉండబోతుంది? అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఒక్కసారి ఎంట్రీ అయిన తర్వాత ఎలాంటి ఆరోపణలు, విమర్శల బాణాలు ఎక్కుపెడుతారో చూడాలి. తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం పవన్‌కల్యాణ్ తమకు అనుకూలంగా రాష్ట్రంలో పర్యటిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Latest Articles
ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్
ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
అందం ఈ వయ్యారితో పోటీలో ఒడి.. ఈమె వద్ద బందీగా మారిందేమో..
అందం ఈ వయ్యారితో పోటీలో ఒడి.. ఈమె వద్ద బందీగా మారిందేమో..
'తీవ్రమైన గాయాలు.. మెడిసిన్‌తోనే మైదానంలోకి ధోని'
'తీవ్రమైన గాయాలు.. మెడిసిన్‌తోనే మైదానంలోకి ధోని'
సైకిల్ బెల్ మాత్రమే మిగిలింది.. జగన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
సైకిల్ బెల్ మాత్రమే మిగిలింది.. జగన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
పీఎఫ్ సొమ్ము ఎన్ని రోజుల్లో అకౌంట్‌లో పడుతుందో తెలిస్తే షాకవుతారు
పీఎఫ్ సొమ్ము ఎన్ని రోజుల్లో అకౌంట్‌లో పడుతుందో తెలిస్తే షాకవుతారు
మా ముందు కోహ్లీ పప్పులుడకవ్.. అమెరికాలో ఆట కట్టిస్తాం: బాబర్
మా ముందు కోహ్లీ పప్పులుడకవ్.. అమెరికాలో ఆట కట్టిస్తాం: బాబర్