ఏపీలో కొత్త ప్రభుత్వం: నామినేటెడ్ పదవులకు టీడీపీ నేతల రాజీనామా

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువైన వేళ.. గత ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు పొందిన వారంతా తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవికి జలీల్‌ఖాన్.. బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పదవికి వేమూరి ఆనంద సూర్య రాజీనామాలు చేశారు. అలాగే జమ్మలమడుగు ఏరియా ఆసుపత్రి చైర్మన్ పదవి నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తనయుడు తప్పుకున్నారు. కాగా సినిమా, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పదవికి శుక్రవారం అంబికా కృష్ణ […]

ఏపీలో కొత్త ప్రభుత్వం: నామినేటెడ్ పదవులకు టీడీపీ నేతల రాజీనామా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 01, 2019 | 4:12 PM

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువైన వేళ.. గత ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు పొందిన వారంతా తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవికి జలీల్‌ఖాన్.. బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పదవికి వేమూరి ఆనంద సూర్య రాజీనామాలు చేశారు. అలాగే జమ్మలమడుగు ఏరియా ఆసుపత్రి చైర్మన్ పదవి నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తనయుడు తప్పుకున్నారు. కాగా సినిమా, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పదవికి శుక్రవారం అంబికా కృష్ణ రాజీనామా చేయగా.. జగన్‌ గెలవగానే ఎస్వీబీసీ భక్తి ఛానెల్ చైర్మన్ పదవి నుంచి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తప్పుకున్న విషయం తెలిసిందే.