తమిళనాడులోని మధురైలో రౌడీ షీటర్‌గా పేరొందిన వరిసూరి సెల్వం అనే వ్యక్తి ఒంటి నిండా బంగారంతో అత్తివరదర స్వామి దర్శనానికి వచ్చారు. అయితే ఆయనకు పోలీసులు రాజమర్యాదలతో స్వామి వారి దర్శనంతో పాటు ప్రత్యేక పూజలు చేయించారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
కాగా వరిసూరి సెల్వంపై ఏకంగా 14కేసులున్నాయి. హత్య, బెదిరింపులు, హత్యాయత్నం వంటి కేసుల్లో అతడు ప్రధాననిందితుడిగా ఉన్నాడు . అయితే ఈయన గారికి మరో పిచ్చి ఉంది. ఒండినిండా బంగారం వేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇక ఇలా ఒండి నిండా బంగారంతో తాజాగా అత్తివరదర స్వామిని దర్శించుకున్నారు. ఆ సమయంలో పోలీసులు పక్కనుండి మరీ రాచమర్యాదలు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.