“అందర్నీ ఒకేసారి చంపెయ్యండి”.. ఢిల్లీ పొల్యూషన్ పై సుప్రీం ఫైర్!

దేశ రాజధాని ఢిల్లీలో గాలి మరియు నీటి నాణ్యతా స్థాయిలను మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. ఢిల్లీలో ప్రజల జీవనం అధ్వాన్నంగా మారిందని సంబంధిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చురకలు అంటించింది. ఢిల్లీ నగరం నరకం కంటే ఘోరంగా మారిందని పేర్కొంది. జస్టిస్ అరుణ్ మిశ్రా, దీపక్ గుప్తా సభ్యుల ధర్మాసనం జాతీయ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణమైన పొరుగు రాష్ట్రాల పంట వ్యర్థాల దహనం సంఘటనలను ప్రస్తావించింది. అలాగే […]

అందర్నీ ఒకేసారి చంపెయ్యండి.. ఢిల్లీ పొల్యూషన్ పై సుప్రీం ఫైర్!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 26, 2019 | 4:48 PM

దేశ రాజధాని ఢిల్లీలో గాలి మరియు నీటి నాణ్యతా స్థాయిలను మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. ఢిల్లీలో ప్రజల జీవనం అధ్వాన్నంగా మారిందని సంబంధిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చురకలు అంటించింది. ఢిల్లీ నగరం నరకం కంటే ఘోరంగా మారిందని పేర్కొంది.

జస్టిస్ అరుణ్ మిశ్రా, దీపక్ గుప్తా సభ్యుల ధర్మాసనం జాతీయ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణమైన పొరుగు రాష్ట్రాల పంట వ్యర్థాల దహనం సంఘటనలను ప్రస్తావించింది. అలాగే బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (బిఐఎస్) పదకొండు  ప్రదేశాల నుండి సేకరించిన నీటి నమూనాల గురించి ప్రస్తావించింది. అవి నాణ్యత పరీక్షలలో విఫలమయ్యాయని పేర్కొంది. దీనికి సంబంధించి వివరాలను అందించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కోరింది.

జాతీయ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యంపై కోర్టు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఉన్నాయి. “ప్రజలు ఎందుకు గ్యాస్ చాంబర్లలో నివసించవలసి వస్తుంది? 15 సంచులలో పేలుడు పదార్థాలు తీసుకొచ్చి వారందరినీ ఒకేసారి చంపండం నయం” అని జస్టిస్ అరుణ్ మిశ్రా కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో అన్నారు,