సెప్టెంబర్ 25.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్లాక్ డే..

ఆ గానం మూగబోయింది. ”పాడుతా తీయగా” అంటూ పాడిన ఆయన స్వరం మన చెవుల నుంచి దూరంగా వెళ్లింది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన గాన గంధర్వుడు పరలోక పయనమయ్యాడు. ఆయన తిరిగి రావాలంటూ దేశవ్యాప్తంగా చేసిన ప్రార్థనలు ఫలించలేదు. గానగంధర్వుడు, పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 25 మధ్యాహ్నం 1.04 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. కరోనా సోకి గత నెల 5న ఆసుపత్రిలో చేరిన ఎస్పీబీ.. కరోనాను జయించినప్పటికీ, మిగిలిన అనారోగ్య సమస్యలతో పోరాటం చేస్తూ […]

సెప్టెంబర్ 25.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్లాక్ డే..
Follow us

|

Updated on: Sep 26, 2020 | 7:31 AM

ఆ గానం మూగబోయింది. ”పాడుతా తీయగా” అంటూ పాడిన ఆయన స్వరం మన చెవుల నుంచి దూరంగా వెళ్లింది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన గాన గంధర్వుడు పరలోక పయనమయ్యాడు. ఆయన తిరిగి రావాలంటూ దేశవ్యాప్తంగా చేసిన ప్రార్థనలు ఫలించలేదు. గానగంధర్వుడు, పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 25 మధ్యాహ్నం 1.04 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. కరోనా సోకి గత నెల 5న ఆసుపత్రిలో చేరిన ఎస్పీబీ.. కరోనాను జయించినప్పటికీ, మిగిలిన అనారోగ్య సమస్యలతో పోరాటం చేస్తూ కన్నుమూశారు. దీంతో యావత్ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అభిమానులు గాన గంధర్వుడిని గుర్తు చేసుకుంటూ అశ్రు నివాళిని అర్పిస్తున్నారు. మీరు ఎప్పటికీ మా గుండెల్లోనే బ్రతికే ఉంటారంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే సరిగ్గా ఏడాది కిందట సెప్టెంబర్ 25వ తేదీని టాలీవుడ్ ఇండస్ట్రీలో చోటు చేసుకున్న మరో విషాదాన్ని తలుచుకుని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (September 25 Black Day To Tollywood)

ఆంధ్రా చాప్లిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు హాస్య నటుడు వేణు మాధవ్. ఆయన అనారోగ్య సమస్యతో 2019, సెప్టెంబర్ 25న మరణించారు. 1997లో ‘సంప్రదాయం’ సినిమా ద్వారా వేణు మాధవ్ టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమా ‘తొలిప్రేమ’ ఆయనకు మంచి బ్రేక్ తెచ్చిపెట్టగా.. ‘లక్ష్మీ’ సినిమా వేణు మాధవ్‌కు నంది అవార్డు తెచ్చిపెట్టింది. ఈ రెండు ఘటనలు యాధృచ్ఛికమే అయినప్పటికీ సెప్టెంబర్ 25 టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్లాక్ డేగా మిగిలిపోయింది.

Latest Articles
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..
భారీ విధ్వసం ముంగిట ప్రపంచం.. అణుయుద్ధం జరిగే 72 నిమిషాల్లో..
భారీ విధ్వసం ముంగిట ప్రపంచం.. అణుయుద్ధం జరిగే 72 నిమిషాల్లో..
వీడిన ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ..!
వీడిన ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ..!
హీరోయిన్ లయ కూతురిని చూశారా ..? ఆ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
హీరోయిన్ లయ కూతురిని చూశారా ..? ఆ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
అందం ఈ ముద్దుగమ్మ చెంతకు చేరి దేవతగా తలచి వరం అడగడం..
అందం ఈ ముద్దుగమ్మ చెంతకు చేరి దేవతగా తలచి వరం అడగడం..
గోవింద్ దేవ్ జీ ఆలయంలో రాధా రాణి పాదాలు ఎందుకు కనిపించవంటే
గోవింద్ దేవ్ జీ ఆలయంలో రాధా రాణి పాదాలు ఎందుకు కనిపించవంటే
కోవిషీల్డ్ తీసుకున్న వారు సేఫ్‌..! : మాజీ శాస్త్రవేత్త రామన్‌
కోవిషీల్డ్ తీసుకున్న వారు సేఫ్‌..! : మాజీ శాస్త్రవేత్త రామన్‌
ఎవరిని అడిగి తీసుకున్నారు.. రజినీ మూవీ టీంపై ఇళయరాజా సీరియస్..
ఎవరిని అడిగి తీసుకున్నారు.. రజినీ మూవీ టీంపై ఇళయరాజా సీరియస్..