స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్నవారు హోమ్ ఐసోలేషన్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు, సవరించిన ‘ఆరోగ్య సూత్రాలు’

| Edited By: Phani CH

Apr 29, 2021 | 5:30 PM

స్వల్ప కోవిడ్ లక్షణాలు, ఎసింప్టోమాటిక్ లక్షణాలు ఉన్నవారు ఇళ్లలో సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలపై కేంద్రం సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.

స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్నవారు హోమ్ ఐసోలేషన్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు, సవరించిన ఆరోగ్య సూత్రాలు
Follow us on

స్వల్ప కోవిడ్ లక్షణాలు, ఎసింప్టోమాటిక్ లక్షణాలు ఉన్నవారు ఇళ్లలో సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలపై కేంద్రం సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో ఆక్సిజన్, హాస్పిటల్స్ లో  బెడ్స్ కొరత ఏర్పడడంతో ఈ విధమైన సింప్తమ్స్ ఉన్నవారు హోం ఐసోలేషన్ లో ఉండాలని సూచించింది.  అసలు ఒక రోగికి ఇలాంటి లక్షణాలు ఉండాలని మెడికల్ ఆఫీసర్ నిర్ధారించి ఉండాలి… ఇక్కడ ఫ్యామిలీ క్వారంటైన్ అన్నది ముఖ్యం.. వారంలో ఏడు రోజులూ, 24 గంటలూ ఓ కేర్ గివర్ (అసిస్టెంట్) అంటూ ఉండాలి.. అతనికి, ఆసుపత్రికి మధ్య కమ్యూనికేషన్ ఉండాలి అని  గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు. మెడికల్ ఆఫీసర్ నిర్ధారించాకే 60  ఏళ్లకు పైబడినవారిని  హోమ్ ఐసోలేషన్ కి .అనుమతిస్తారు…. అలాగే డయాబెటిస్, గుండె జబ్బులు వంటి రుగ్మతలతో బాధపడుతున్నవారు కూడా ఇలా స్వీయ నియంత్రణలో ఉంటూనే ఎప్పటికప్పుడు  డాక్టర్ల సలహా తీసుకుంటూ ఉండాలి.. హెచ్ ఐ వీ, క్యాన్సర్ థెరపీ తీసుకుంటున్నవారిని హోం ఐసోలేషన్ కి అనుమతించబోరని ఈ మార్గదర్శకాల్లో  స్పష్టం చేశారు.

రోగితో బాటు అసిస్టెంట్ కూడా హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి మెడిసిన్స్ ని రెడీగా ఉంచుకోవాలని,  పేషంట్  కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని, వెంటిలేషన్ బాగా ఉండే గదులు శ్రేష్టమని పేర్కొన్నారు. రోగి మూడు లేయర్ల ఎన్ 95 వంటి మాస్క్ ధరిస్తే మంచిదని, ఒక శాతం సోడియం హైపో క్లోరైట్ తో డిస్ ఇన్ఫెక్ట్ చేశాక ఆ మాస్కును వదిలేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలని, న్యూట్రిషియస్ ఫుడ్ బెటర్ అని సూచించారు. ఎక్కువగా తరచూ శానిటైజర్ లేదా సబ్బుతో చేతులుశుభ్రం చేసుకుంటూ  ఉండాలని, పల్స్ ఆక్సిమీటర్ తో  ఆక్సిజన్ లెవెల్  చూసుకుంటూ ఉండాలని కూడా వివరించారు.  శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా, ఆక్సిజన్ స్థాయి తగ్గినా, మానసిక స్థితి అనిశ్చితంగా ఉన్నా ఆసుపత్రిని సందర్శించాలని సవరించిన ఈ మార్గదర్శక సూత్రాల్లో వివరించారు. బుడోస్ నైడ్ అనే  ఇన్-హేలర్ కూడా మంచిదేనని, దీన్ని ఆస్తమా రోగులు  ఎక్కువగా వాడుతుంటారని పేర్కొన్నారు. రెమ్ డెసివిర్ మందును వైద్యుల సలహా మేరకే వాడాలని పేర్కొన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Jagan on Vaccination: వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌పై కీలక వ్యాఖ్యలు.. ఫిబ్రవరి దాకా సాధ్యం కాదని వ్యాఖ్య

Funerals: ఆపద సమయంలో ఆపన్న హస్తం.. మహాసేవ పేరుతో కోవిడ్ మృతులకు అంత్యక్రియలు… జేజేలు పలుకుతున్న జనం