ఆ సక్సెస్‏ఫుల్ డైరెక్టర్ సినిమాకు నో చెప్పిన మాస్ మహారాజా రవితేజ.. కారణం ఇదేనా ?..

హిట్టు, ప్లాప్‏లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ తెగ బిజీగా ఉన్నాడు మాస్ మాహారాజా రవితేజ. ప్రస్తుతం రవితేజ క్రాక్ సినిమా చిత్రీకరణలో ఉన్నాడు.

ఆ సక్సెస్‏ఫుల్ డైరెక్టర్ సినిమాకు నో చెప్పిన మాస్ మహారాజా రవితేజ.. కారణం ఇదేనా ?..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 25, 2020 | 9:19 PM

హిట్టు, ప్లాప్‏లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ తెగ బిజీగా ఉన్నాడు మాస్ మాహారాజా రవితేజ. ప్రస్తుతం రవితేజ క్రాక్ సినిమా చిత్రీకరణలో ఉన్నాడు. అటు ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా విడుదల చేసెందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. కాగా రవితేజ్ మరో సక్సెస్‏ఫుల్ డైరెక్టర్‏తో చేయాల్సిన సినిమా నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

గత సంవత్సరం ప్రతిరోజు పండగే సినిమాతో మంచి విజయం అందుకున్న డైరెక్టర్ మారుతి. ఆ సినిమా తర్వాత మాస్ మహారాజా రవితేజతో ఓ సినిమా చేయాలని అనుకున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన కథను రవితేజకు కూడా వినిపించడట. కథ నచ్చడంతో మాస్ మాహారాజా ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజా సమచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. పారితోషికం విషయంలో తేడా రావడంతో ఆ సినిమా నుంచి రవితేజ తప్పుకున్నట్లుగా ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. కాగా రవితేజతో సినిమా తీసెందుకు మారుతి దర్శకత్వంలో గీతా-2, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రం ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. కానీ రవితేజ పారితోషికం విషయంలో తేడా రావడంతో ఈ సినిమా ఆగిపోయిందని.. వేరే హీరోతో ఈ మూవీ తెరకెక్కించడానికి చిత్రయూనిట్ సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ వార్తలు నిజామా కావా అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?