Rajinikanth Political Entry: పొలిటికల్ ఎంట్రీపై తలైవా క్లారిటీ.. 60 నుంచి 65 శాతం సీట్లు యువతకే…

|

Mar 12, 2020 | 1:55 PM

Rajinikanth Political Entry: సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించి చాలా సంవత్సరాలు అయింది. ఆయన బీజేపీలోకి చేరతారనే వార్తలు కూడా వచ్చాయి. రజినీ ప్రత్యేకంగా ఓ పార్టీ పెడతారా.? లేదా ఏదైనా పార్టీలోకి చేరతారా అనే అంశానికి తాజాగా తెరపడింది. ఈ విషయంపై సూపర్ స్టార్ రజినీకాంత్ కొద్దిసేపటి క్రితమే స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. చెన్నైలోని హోటల్ లీలా ప్యాలెస్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన త్వరలోనే రాజకీయ పార్టీ పెడతానని స్పష్టం […]

Rajinikanth Political Entry: పొలిటికల్ ఎంట్రీపై తలైవా క్లారిటీ.. 60 నుంచి 65 శాతం సీట్లు యువతకే...
Follow us on

Rajinikanth Political Entry: సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించి చాలా సంవత్సరాలు అయింది. ఆయన బీజేపీలోకి చేరతారనే వార్తలు కూడా వచ్చాయి. రజినీ ప్రత్యేకంగా ఓ పార్టీ పెడతారా.? లేదా ఏదైనా పార్టీలోకి చేరతారా అనే అంశానికి తాజాగా తెరపడింది. ఈ విషయంపై సూపర్ స్టార్ రజినీకాంత్ కొద్దిసేపటి క్రితమే స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.

చెన్నైలోని హోటల్ లీలా ప్యాలెస్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన త్వరలోనే రాజకీయ పార్టీ పెడతానని స్పష్టం చేశారు. తనకు వ్యక్తిగతంగా మోసం జరిగిందని.. చాలామంది తప్పుగా అర్ధం చేసుకున్నారని తెలిపారు. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడిందన్నారు. అప్పుడే రాజకీయాల్లోకి రావాలని అనుకున్నా.. కానీ 2017లోనే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించానని రజినీకాంత్ వెల్లడించారు.

రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకోవాలి. దానికి కావలసిన పాలసీలు తన దగ్గర ఉన్నాయని సూపర్ స్టార్ రజినీకాంత్ చెప్పుకొచ్చారు. డీఎంకే, ఏడిఎంకే పార్టీల్లో 50 వేలకు పైగా పదవులున్నాయని.. అన్ని పార్టీల్లో కూడా 50 ఏళ్లకు పైబడ్డ వారే ఉన్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా యువతకు ఈ పార్టీలు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదని ప్రశ్నించారు.

రాజకీయాల్లోకి యువ రక్తం కావాలన్న ఆయన.. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లను తన పార్టీలోకి ఆహ్వానిస్తానని తెలిపారు. తనకు సీఎం పదవిపై వ్యామోహం లేదన్న రజినీకాంత్.. బాగా చదువుకున్న విజ్ఞానవంతుడినే సీఎంని చేస్తానని మాటిచ్చారు. పదవులు ఆశించేవారు తనకు అవసరం లేదని ఆయన తెలిపారు. పార్టీలో సుమారు 60 నుంచి 65 శాతం యువతకు, సామాన్య ప్రజలకు సీట్లు ఇస్తానన్నారు. కాగా, ఏప్రిల్ 14న రజినీకాంత్ తన పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

For More News:

ఏపీ: ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు…

కరోనా భయం.. కేంద్రం సంచలన నిర్ణయం.. ఏప్రిల్ 15 వరకు అన్ని వీసాలు రద్దు..

కరోనా ఎఫెక్ట్.. 6 వేల కోళ్లు సజీవ సమాధి.. వీడియో వైరల్..

సఫారీ సిరీస్.. టీమిండియాకు ఆ ముగ్గురే కీలకం…

‘వకీల్ సాబ్’లో గోవా బ్యూటీ..?

మధ్యతరగతి ప్రజలకు షాక్.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు తగ్గింపు.?

ఐపీఎల్ 2020 తాత్కాలికంగా రద్దు..?

రూ.60 లక్షల లాటరీ గెలిచాడు.. అంతలోనే షాక్ తగిలింది..