AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమా చిత్రీకరణ కంటే గ్రాఫిక్స్‌కే ఎక్కువ ఖర్చు చేస్తోన్న జక్కన్న.. మరో విజువల్ వండర్‌గా ఆర్.ఆర్.ఆర్

ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చే జక్కన్న ఆర్.ఆర్.ఆర్‌లోనూ గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నాడట. ఇందులో భాగంగా విఎఫ్ఎక్స్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్‌ను కూడా కేటాయించారని సమాచారం.

సినిమా చిత్రీకరణ కంటే గ్రాఫిక్స్‌కే ఎక్కువ ఖర్చు చేస్తోన్న జక్కన్న.. మరో విజువల్ వండర్‌గా ఆర్.ఆర్.ఆర్
Narender Vaitla
|

Updated on: Dec 19, 2020 | 3:46 PM

Share

Rajamouli spends more budget for vfx: రాజమౌళి సినిమా అంటేనే అద్భుత ‌దృశ్య కావ్యం గుర్తొస్తుంది. జక్కన్న ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటాడు. మరీ ముఖ్యంగా ఈగ, బాహుబలి చిత్రాల్లో రాజమౌళి గ్రాఫిక్స్‌తో మాయ చేశాడు. ఈ చిత్రాలు తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. ఇక ఈ స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చే జక్కన్న ఆర్.ఆర్.ఆర్‌లోనూ గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నాడట. ఇందులో భాగంగా విఎఫ్ఎక్స్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్‌ను కూడా కేటాయించారని సమాచారం. ఇక ఈ సినిమా చిత్రీకరణ కంటే.. గ్రాఫిక్స్‌కు అయ్యే ఖర్చే ఎక్కువనే ప్రచారం జరుగుతోంది. గ్రాఫిక్స్ కోసం ఈ స్థాయిలో ఖర్చు చేస్తోన్న తొలి తెలుగు చిత్రం ఇదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా కోసం జక్కన్న హాలీవుడ్‌కు చెందిన సాంకేతిక నిపుణుల సహాయం తీసుకుంటున్నాడని టాక్. ఇక పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి. అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియా, సముద్ర ఖని వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి సంచలనాలకు తెరతీస్తుందో చూడాలి.

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ