వెదర్ రిపోర్ట్ : తమిళనాడు తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం, వచ్చే 48 గంటల్లో తెలంగాణలో ఓ మోస్తారు వర్షాలు

|

Jan 07, 2021 | 10:21 PM

తమిళనాడు తీర ప్రాంతంలో ఒకటిన్నర కిలో మీటర్ల ఎత్తు వరకూ కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా రాబోయే 48 గంటల్లో తెలంగాణలో..

వెదర్ రిపోర్ట్ : తమిళనాడు తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం, వచ్చే 48 గంటల్లో తెలంగాణలో ఓ మోస్తారు వర్షాలు
Follow us on

తమిళనాడు తీర ప్రాంతంలో ఒకటిన్నర కిలో మీటర్ల ఎత్తు వరకూ కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా రాబోయే 48 గంటల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌లో మేఘావృతం కొనసాగుతూ ఒకటి రెండు చోట్ల చిరు జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్నం తెలిపారు. గత 24 గంటల్లో హైదరాబాద్‌లో 1.1 మిలీ మీటర్ల వర్షపాతం.. రంగారెడ్డి జిల్లాలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత్తలు 26 సెల్సియస్‌ డిగ్రీల వరకూ నమోదయ్యే అవకారం ఉందని నాగరత్నం వెల్లడించారు.