3 రోజుల్లో పీఎఫ్ సొమ్ము.. థాంక్స్ టు మోదీజీ!

3 రోజుల్లో పీఎఫ్ సొమ్ము.. థాంక్స్ టు మోదీజీ!

కరోనా వైరస్, 40 రోజులుగా లాక్ డౌన్ వెరసి మధ్య తరగతి ఉద్యోగుల పరిస్థితి అతలాకుతలం అయిపోయింది. చేతిలో డబ్బులు లేక, సరైన సమయంలో వేతనాలు అందక, ఇంట్లో సరుకులు నిండుకుని మధ్య తరగతి ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

Rajesh Sharma

|

May 01, 2020 | 7:30 PM

కరోనా వైరస్, 40 రోజులుగా లాక్ డౌన్ వెరసి మధ్య తరగతి ఉద్యోగుల పరిస్థితి అతలాకుతలం అయిపోయింది. చేతిలో డబ్బులు లేక, సరైన సమయంలో వేతనాలు అందక, ఇంట్లో సరుకులు నిండుకుని మధ్య తరగతి ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవారికి ఉచితంగా సరుకులు పంపిణీ చేస్తుంది. చేతి ఖర్చుల కోసం కొంత డబ్బులు కూడా సహాయం చేస్తుంది. కానీ రేషన్ కార్డు లేని మధ్యతరగతి ఉద్యోగులకు ఈ లాక్ డౌన్ పీరియడ్ నరకం చూపిస్తుంది.

దాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ప్రావిడెంట్ ఫండ్ సంస్థ మధ్యతరగతి ఉద్యోగులకు చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చింది. ప్రావిడెంట్ ఫండ్ ఉపసంహరణకు సంబంధించి నిబంధనలు సడలించింది. గతంలో ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఎంతో కొంత సొమ్మును ఉపసంహరించుకుంటామని అనుకున్న ఉద్యోగుల విజ్ఞప్తులను ప్రావిడెంట్ ఫండ్ సంస్థ 20 రోజుల్లో పరిష్కరించేది. అంటే వారు కోరుకున్న సొమ్ము వారి బ్యాంక్ అకౌంటుకు చేరడానికి 20 రోజుల సమయం పట్టేది. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రావిడెంట్ ఫండ్ నిబంధనలు సడలించింది. ప్రస్తుతం కేవలం 30 శాతం ఉద్యోగులతో పనిచేస్తున్న ప్రావిడెంట్ ఫండ్ సంస్థ కేవలం మూడు రోజుల్లో ఉద్యోగుల విజ్ఞప్తులను పరిష్కరిస్తుంది.

పీఎఫ్ ఉపసంహరణ దరఖాస్తులను వేగంగా పరిష్కరిస్తున్నామని, కేవలం మూడు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో నగదు వేస్తున్నామని హైదరాబాద్ పిఎఫ్ కమిషనర్ చంద్రశేఖర్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 80 వేల 647 మంది ఉద్యోగులు పిఎఫ్ ఉపసంహరణకు దరఖాస్తు చేసుకున్నారని, వారందరికీ కలిపి 258 కోట్ల రూపాయలు ఏప్రిల్ 30వ తేదీ నాటికి వారి బ్యాంకు అకౌంట్లలో వేసామని ఆయన వివరించారు. పిఎఫ్ ఉపసంహరించుకున్న వారిలో ఐటీ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారని ఆయన తెలిపారు.

హైదరాబాదులో ఇప్పుడు ఈ ప్రాంతాలే కీలకం

ఉద్ధవ్ థాకరేకు ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్

లింగంపల్లి నుంచి తొలి స్పెషల్ రైలు.. ఎక్కడికంటే?

3 రోజుల్లో పీఎఫ్ సొమ్ము.. థాంక్స్ టు మోదీజీ!

డాక్టర్లపై అర్దరాత్రి దాడి.. బైకు దగ్ధం 

గ్రీన్ జోన్లలోనే సడలింపులు.. అందుకే వర్గీకరణ

‘తరుగు’ మోసాలపై సీఎం సీరియస్  

హైరిస్క్‌లో 4 వేల మంది.. తాజా లెక్కలతో సీఎం షాక్

ప్రత్యేక రైళ్లకు ప్రత్యేక ఆంక్షలు.. కేంద్రం భారీ కసరత్తు 

Big Breaking మరో రెండు వారాలు లాక్ డౌన్ 

రెడ్ జోన్ల చుట్టూ డీమార్కేషన్.. నిఘాకు ప్రత్యేక వ్యూహం  

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu