షార్క్ నుంచి భర్తను కాపాడుకున్న గర్భిణి

|

Sep 25, 2020 | 4:18 PM

ఓ గర్భిణి సాహసం ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.  స్నార్కెలింగ్‌ యాత్ర చేస్తున్న ఓ ఫ్యామిలీలోని ఒకరు షార్క్‌కు చిక్కారు.

షార్క్ నుంచి భర్తను కాపాడుకున్న గర్భిణి
Follow us on

ఓ గర్భిణి సాహసం ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.  స్నార్కెలింగ్‌ యాత్ర చేస్తున్న ఓ ఫ్యామిలీలోని ఒకరు షార్క్‌కు చిక్కారు. దీంతో ఏం చేయాలో తెలియక వారంతా గట్టిగా అరవడం ప్రారంభించారు. ఈ క్రమంలో గర్భిణి అయిన అతడి భార్య భర్త రక్తం మరకలు చూసి, ఒక్క ఉదుటన నీళ్లలో దూకి,  సురక్షితంగా పైకి లాగింది. భుజంపై తీవ్ర గాయాలైన ఆయనను మయామిలోని ట్రామా సెంటర్‌కు తరలించారు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది ఈ ఘటన.

జార్జియా రాష్ట్రానికి చెందిన మార్గోట్ డ్యూక్స్ ఎడ్డీ-ఆండ్రూ ఎడ్డీ జంట కుటుంబంతో కలిసి ఫ్లోరిడాలో సెలవు రోజులను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబంతో కలిసి ఒక ప్రైవేట్ పడవలో ప్రయాణిస్తూ ఉండగా, అకస్మాత్తుగా ఆండ్రూ పడవ నుంచి జారిపోయి నీటిలో పడ్డాడు. ఇంతలో ఒక పెద్ద సొరచేప అతడిని గట్టిగా పట్టుకుంది. అతడి రక్తం నీటిపై కనిపించడంతో, రెండో ఆలోచన లేకుండా డ్యూక్స్‌ నీటిలోకి దూకేసింది. ఇతర ఫ్యామిలీ మెంబర్స్ సాయంతో భర్తను షార్క్‌నుంచి కాపాడుకుంది. కాగా, తెగువచూపి భర్తను కాపాడుకున్న గర్భిణి డ్యూక్స్‌ను అందరూ ప్రశంశిస్తున్నారు.

Also Read :

‘పబ్​జీ’ ప్రేమాయణం, చివరకు !

గాన గంధర్వడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూత

తాలుకు కూడా అదిరే రేటు !