మహా నగరంలో మహా మోసగాడు… ఎంబీబీఎస్ ఫ్రం ఉస్మానియా…నకిలీ డాక్టర్‌కు చెక్ పెట్టిన హైదరాబాద్ పోలీసులు..

వైద్య విద్య చదవకుండానే బోర్డు పెట్టుకుని ట్రీట్‌మెంట్‌ చేస్తున్న నకిలీ డాక్టర్‌ను మీర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. ఇతనిది కర్మన్‌ఘాట్‌గా తేల్చారు. ఇతని దగ్గర ఎవరెవరు చికిత్స తీసుకున్నారు... ఎంతమందికి సూది పొడిచాడు....

మహా నగరంలో మహా మోసగాడు... ఎంబీబీఎస్ ఫ్రం ఉస్మానియా…నకిలీ డాక్టర్‌కు చెక్ పెట్టిన హైదరాబాద్ పోలీసులు..
Follow us

|

Updated on: Dec 10, 2020 | 5:32 AM

ఈ కేటుగాడు ఎంబీబీఎస్‌తో ఆగలేదు…. ఏకంగా ఎండీ చదివానంటూ బోర్డు తగిలించాడు. అది కూడా ఎక్కడో, ఏ మారుమూల ఏజెన్సీ ప్రాంతంలోనో కాదు… హైదరాబాద్‌లో. మీర్‌పేట్‌లో దర్జాగా ప్రాక్టీస్‌ మొదలు పెట్టాడు. ఎట్టకేలకు అతడి ఆట కట్టించారు పోలీసులు.

మెడిసిన్‌ చదవకపోయినా.. స్టెతస్కోప్‌ పట్టాడు. ఏకంగా మీర్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ కార్యాలయం ముందే సాయి క్లినిక్‌ పేరుతో దుకాణం తెరిచాడు. అతను పెట్టుకున్న బోర్డు చూస్తే ఎవరైనా షాక్‌ అవుతారు. ఎంబీబీఎస్ ఫ్రం ఉస్మానియా… జనరల్ మెడిసిన్‌లో ఎండీ.. ఫిజీషియన్‌ అండ్ డయాబెటాలజిస్ట్‌ అంటూ అమాయకులను ఎట్రాక్ట్‌ చేశాడు.

వైద్య విద్య చదవకుండానే బోర్డు పెట్టుకుని ట్రీట్‌మెంట్‌ చేస్తున్న నకిలీ డాక్టర్‌ను మీర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. ఇతనిది కర్మన్‌ఘాట్‌గా తేల్చారు. ఇతని దగ్గర ఎవరెవరు చికిత్స తీసుకున్నారు… ఎంతమందికి సూది పొడిచాడు.. వాళ్ల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే వివరాలు ఆరా తీస్తున్నారు. మెడిసిన్‌ చదివినట్టు అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేశారు.

Latest Articles