Petrol Diesel Price Today: ఫిబ్రవరి నెలలోనే 14 సార్లు పెరిగిన పెట్రోల్ ధరలు.. సండే బ్రేక్.. లేటెస్ట్ రేట్లు ఇవే…

|

Feb 21, 2021 | 11:29 AM

ఫిబ్రవరి నెలలో చమురు ధరలు వాహనదారులకు షాక్ కొట్టిస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్​ ధరల పెంపుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

Petrol Diesel Price Today:  ఫిబ్రవరి నెలలోనే 14 సార్లు పెరిగిన పెట్రోల్ ధరలు.. సండే బ్రేక్.. లేటెస్ట్ రేట్లు ఇవే...
Follow us on

Petrol Diesel Price in Hyderabad: ఫిబ్రవరి నెలలో చమురు ధరలు వాహనదారులకు షాక్ కొట్టిస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్​ ధరల పెంపుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరికొందరు సోషల్ మీడియా వేదికగా మీమ్స్ షేర్ చేస్తూ.. ఇబ్బందిని తెలియజేస్తున్నారు. వరుసగా 12రోజులపాటు(ఈనెల 20వరకు) పెరిగిన చమురు ధరలు.. నేడు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.

ఈ ఏడాదిలో ఇప్పటివరకు 24 సార్లు  పెట్రోల్‌ ధరలు పెరిగాయి. ఫిబ్రవరి నెలలోనే 14 సార్లు పెరిగాయి. వరుసగా పెరుగుతున్న ధరలకు ఆదివారం బ్రేక్‌లు పడ్డాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ. 90.58గానూ.. లీటరు డీజిల్​ రేటు రూ. 80.97గా ఉంది. ఇతర ప్రధాన నగరాల్లో లీటర్​ పెట్రోల్​ ధర రూ.90పైనే కొనసాగుతోంది.అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్​ ముడి చమురు ధరల్లో మార్పులు, డాలురుతో రూపాయి మారకం విలువ హెచ్చుతగ్గుల వల్లే ఇంధన రేట్లు పెరిగాయి.

పెట్రోల్ ధర నేడు విజయవాడలో లీటర్ రూ. 96.10 ఉండగా.. డీజిల్ ధర 89.72గా ఉంది

పెట్రోల్ ధర నేడు హైదరాబాద్‌లో లీటర్ రూ. 94.18  ఉండగా.. డీజిల్ ధర 88.31గా ఉంది

 

Also Read:

తూర్పుగోదావరి జిల్లాలో కలకలం.. వింతవ్యాధితో మేకలు మృత్యువాత.. ‘పొట్ట ఉబ్బి, నురగలు కక్కుతూ’

ముంబై వెళ్లి సినీనటి కావాలనుకున్న ఆరో తరగతి చదువుతున్న బాలిక.. కాకినాడ రైల్వే స్టేషన్‌లో ఏం జరిగిందంటే..?