అతిపెద్ద కోవిద్-19 ఆసుపత్రి నిర్మాణం దిశగా.. ఒడిశా సర్కార్..!

కోవిడ్-19 భారతదేశంలో రోజురోజుకూ విజృంభిస్తోంది. కొన్ని చోట్ల వైరస్‌ సోకిన వారికి సరైన వైద్యసేవలు అందించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఐసోలేషన్ వార్డులు, చికిత్సకు కావల్సిన వైద్య పరికరాలు అందుబాటులో

అతిపెద్ద కోవిద్-19 ఆసుపత్రి నిర్మాణం దిశగా.. ఒడిశా సర్కార్..!
Follow us

| Edited By:

Updated on: Mar 26, 2020 | 7:18 PM

కోవిడ్-19 భారతదేశంలో రోజురోజుకూ విజృంభిస్తోంది. కొన్ని చోట్ల వైరస్‌ సోకిన వారికి సరైన వైద్యసేవలు అందించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఐసోలేషన్ వార్డులు, చికిత్సకు కావల్సిన వైద్య పరికరాలు అందుబాటులో లేక అటు రోగులు మాత్రమే కాదు, ఇటు వైద్యులు కూడా నానా కష్టాలు ఎదురుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒడిశా సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా(కోవిడ్-19) వైద్య సేవల కోసం ప్రత్యేకంగా వెయ్యి పడకల గల 19 ఆసుపత్రులను నిర్మించాలని ఒడిశా సర్కార్ తీర్మాణం చేసింది. వీటితో పాటు 2వేల ఐసోలేషన్‌ బెడ్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా.. కేవలం కరోనా వ్యాధిగ్రస్తులకు మాత్రమే చికిత్స అందించేందుకు మాత్రమే ఈ ఆసుపత్రులు పని చేస్తాయని పేర్కొంది. వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్కరకి ఇక్కడే వైద్య సదుపాయాలు అందించే అవకాశం ఉంటుంది. అంతేకాక.. వైద్య సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి నాలుగు నెలల జీతాన్ని ముందుగానే అందిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్షం చేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వైద్య పరీక్షల కోసం ప్రత్యేకమైన ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తెలిపింది. దేశంలోనే కరోనా వ్యాధిని ఎదురుకొనేందుకు ఏర్పాటు చేసిన అది పెద్ద వైద్య సదుపాయం ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఆయన ప్రభుత్వంపై సోషల్‌మీడియలో ప్రశంసల వర్షం కురుస్తోంది.