ఇక నుంచి 100 ఎస్‌ఎంఎస్‌లు దాటితే నో ఛార్జీలు..

|

Jun 04, 2020 | 12:17 PM

ట్రాయ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్యేతర వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. ఇకపై రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు దాటి పంపించినా ఎటువంటి చార్జీలుండవు అని ట్రాయ్ తెలిపింది.

ఇక నుంచి 100 ఎస్‌ఎంఎస్‌లు దాటితే నో ఛార్జీలు..
Follow us on

ట్రాయ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్యేతర వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. ఇకపై రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు దాటి పంపించినా ఎటువంటి చార్జీలుండవు అని ట్రాయ్ తెలిపింది. వాస్తవానికి ఇప్పటివరకు ఒక్కో సిమ్ నుంచి రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పంపించేందుకు వీలు ఉంది.

ఆపైన పంపించే ప్రతీ ఎస్‌ఎంఎస్‌కు 50 పైసలు చొప్పున వసూలు చేయాలని టెలికాం ఆపరేటర్లకు ట్రాయ్ నిబంధన పెట్టింది. అప్పట్లో టెలీ మార్కెటింగ్, అసత్యపూరితమైన మెసేజ్‌లకు అడ్డుకట్ట వేసేందుకు ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకోగా.. తాజాగా వాణిజ్యేతర వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ట్రాయ్ ఈ నిబంధనను ఎత్తివేసింది. ఈ మేరకు టెలికాం టారిఫ్ రూల్స్- 2012లోని దానికి సంబంధించిన ప్రత్యేక నిబంధనను తొలిగిస్తు సవరణ చేసింది.

Also Read:

ఏపీలో కొన్ని స్టేషన్లలోనే ఆగనున్న రైళ్లు.. వారికి డబ్బులు రీఫండ్..

వైఎస్ఆర్ వాహనమిత్ర.. వారి ఖాతాల్లోకి రూ.10 వేలు జమ..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై భూములకు ‘భూధార్’..

అప్పటివరకు సిటీ బస్సు సర్వీసులు లేనట్లే..!

ఇక నుంచి సచివాలయాల్లోనే రేషన్ కార్డులు..!

సినిమా థియేటర్ల రీ-ఓపెన్‌పై కేంద్రం క్లారిటీ..!