తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వేలిముద్ర లేకుండా పింఛన్ల పంపిణీ..

|

Aug 10, 2020 | 4:37 PM

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తున్న నేపధ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల పంపిణీలో పలు జాగ్రత్తలు పాటించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వేలిముద్ర లేకుండా పింఛన్ల పంపిణీ..
Follow us on

Pension Distribution No Biometric: వికారాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తున్న నేపధ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల పంపిణీలో పలు జాగ్రత్తలు పాటించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైరస్ ప్రభావం ఎక్కువగా వృద్ధులపైనే ఉంటుందని కాబట్టి.. వారికి పెన్షన్లు ఇచ్చే సమయంలో వేలిముద్రలు తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీనితో జిల్లా యంత్రాంగం వృద్ధులకు, దివ్యాంగులకు బయోమెట్రిక్ లేకుండానే నేరుగా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు.

అలాగే పెన్షన్లు పంపిణీ చేసే సమయంలో వృద్ధులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక బ్యాంకుల వద్ద పెన్షన్ డబ్బులు తీసుకునేటప్పుడు రద్దీ కాకుండా ఉండేందుకు అధికారులు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సదుపాయాన్ని కూడా వినియోగిస్తున్నారు. కాగా, ఈ నెల నుంచే ఇది అమలవుతుండగా.. ప్రభుత్వం తదుపరి ఆదేశాలు వచ్చేవరకు జిల్లాలో ఇదే విధానం ద్వారా పింఛన్ల పంపిణీ జరుగుతుందని డీఆర్డీఓ కృష్ణన్ వెల్లడించారు.

Also Read:

ఏపీ: ఆ మూడు లక్షణాలున్నా ఆసుపత్రిలో చేరొచ్చు..

రూ. 2000 వేల నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపేసిన ఆర్బీఐ..

జగన్ సర్కార్ మరో ముందడుగు.. సచివాలయాలకు ప్రత్యేక కాల్ సెంటర్‌..

ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త.. ప్రీమియం చెల్లించని వారికి మరో ఛాన్స్..