నిర్భయ ‘ఆశ’ల పోరాటానికి హ్యాట్సాఫ్..!

|

Mar 20, 2020 | 2:14 PM

Nirbhaya Case: కంటికి రెప్పలా కాపాడుకున్న కన్న కూతురి మరణం.. ఆమెను ఓ వారియర్‌గా చేసింది. ఆమె మరణానికి కారణమైన వారిని వదిలేయకూడదనే సంకల్పం తనను ఇంతవరకు తీసుకొచ్చింది. ఇలా అన్నీ వెరిసి నిర్భయ తల్లి ఆశాదేవిని ఓ యోధురాలుగా మార్చి న్యాయం గెలవడం కోసం ఏడేళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసేలా చేసింది. ఎట్టకేలకు ఆమె నిరీక్షణకు తెరపడుతూ దోషులకు ఇవాళ ఉరి పడింది. తలారీ పవన్ ఆ నలుగురిని తీహార్ జైలులో ఒకేసారి ఉరి తీశారు. […]

నిర్భయ ఆశల పోరాటానికి హ్యాట్సాఫ్..!
Follow us on

Nirbhaya Case: కంటికి రెప్పలా కాపాడుకున్న కన్న కూతురి మరణం.. ఆమెను ఓ వారియర్‌గా చేసింది. ఆమె మరణానికి కారణమైన వారిని వదిలేయకూడదనే సంకల్పం తనను ఇంతవరకు తీసుకొచ్చింది. ఇలా అన్నీ వెరిసి నిర్భయ తల్లి ఆశాదేవిని ఓ యోధురాలుగా మార్చి న్యాయం గెలవడం కోసం ఏడేళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసేలా చేసింది. ఎట్టకేలకు ఆమె నిరీక్షణకు తెరపడుతూ దోషులకు ఇవాళ ఉరి పడింది. తలారీ పవన్ ఆ నలుగురిని తీహార్ జైలులో ఒకేసారి ఉరి తీశారు. 48 మంది పోలీస్ సిబ్బంది పర్యవేక్షణ దోషులను ఉరి తీశారు.

2013 నుంచి ప్రతీ రోజూ ఆశాదేవి పోరాటం చేస్తూనే ఉన్నారు. తన బిడ్డకు అన్యాయం చేసిన వారి కోసమే కాదు.. ఇక ఏ కూతురికి ఇలాంటి దుస్థితి రాకూడదని ఆమె చేసిన పోరాటానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. నిర్భయ దోషులు న్యాయవ్యవస్థలో ఉన్న లొసుగులు ఉపయోగించుకుని ఇన్నాళ్లు శిక్ష నుంచి తప్పించుకుంటూ వచ్చారు. ఆఖరికి ఉరి శిక్ష కొద్దిగంటల్లో అమలు అవుతుండగా కూడా అర్ధరాత్రి వరకు డ్రామాలు కొనసాగించారు. ఉరిశిక్షను ఎలాగైనా వాయిదా వేయించుకోవాలని ప్రయత్నాలు చేశారు. చివరి క్షణంలో కూడా దోషులు కోర్టులో పిటిషన్ వేయగా.. అప్పుడు కూడా ఆశాదేవి తెల్లవార్లూ విచారణ జరిగినంతసేపు కోర్టు బయటే కూర్చుని న్యాయం కోసం ఎదురుచూసింది. కాగా, నిర్భయ దోషులను ఉరి తీయడంతో.. ఆలస్యమైనా న్యాయం గెలిచిందని ఆశాదేవి సంబరపడ్డారు.

For More News:

నిర్భయ ‘ఆశ’ల పోరాటానికి హ్యాట్సాఫ్..!

నిర్భయ తరపు న్యాయవాది ఫీజు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

వారిని కాదు.. నిర్భయ తల్లిని శిక్షించాలట.. దోషుల తరపు లాయర్

నా కుమార్తె ఫొటోను కౌగలించుకున్నా: నిర్భయ తల్లి భావోద్వేగం

Breaking… నిర్భయ దోషులకు ఉరి అమలు…

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే

కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్…

Breaking: ఏపీలో రెండో కరోనా పాజిటివ్ కేసు..

కరోనా భయం.. తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు వేల కోళ్లు సజీవ సమాధి..