బ్యాన్ చేసిన చైనీస్ యాప్స్‌ ఇంకా పని చేస్తున్నాయట.!

Chinese Apps Functional Via Websites: భారత సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లితున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం 59 చైనీస్ యాప్స్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ బ్యాన్ అమలులోకి వచ్చి రెండువారాలు ముగుస్తుండగా..ఇటీవలే పలు సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. బెంగళూరుకు చెందిన కొంతమంది పరిశోధకులు చేసిన అధ్యయనంలో దేశంలో బ్యాన్ అయిన 59 చైనీస్ యాప్స్‌లలో 33 పూర్తిగా బ్లాక్ కాగా.. మిగిలిన 26 అప్లికేషన్లకు సొంతంగా వెబ్‌సైట్లు ఉన్నట్లు తేలింది. వాటిల్లో […]

బ్యాన్ చేసిన చైనీస్ యాప్స్‌ ఇంకా పని చేస్తున్నాయట.!
Follow us

|

Updated on: Jul 16, 2020 | 1:42 AM

Chinese Apps Functional Via Websites: భారత సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లితున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం 59 చైనీస్ యాప్స్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ బ్యాన్ అమలులోకి వచ్చి రెండువారాలు ముగుస్తుండగా..ఇటీవలే పలు సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. బెంగళూరుకు చెందిన కొంతమంది పరిశోధకులు చేసిన అధ్యయనంలో దేశంలో బ్యాన్ అయిన 59 చైనీస్ యాప్స్‌లలో 33 పూర్తిగా బ్లాక్ కాగా.. మిగిలిన 26 అప్లికేషన్లకు సొంతంగా వెబ్‌సైట్లు ఉన్నట్లు తేలింది.

వాటిల్లో తొమ్మిది పూర్తిగా పని చేస్తుండగా.. 11 పాక్షికంగా పని చేస్తున్నాయి. ఇక మిగిలిన 6 ప్రస్తుతం కార్యాచరణలో లేవని తేలింది. 59 చైనీస్ యాప్స్‌లలో 39 అప్లికేషన్లకు సొంతంగా వెబ్‌సైట్లు ఉన్నాయి. వాటిల్లో 13 బ్లాక్ కాగా.. మిగిలిన యాప్స్ అన్నీ కూడా వర్క్ చేస్తున్నట్లు రోబోస్ అఫ్ టెక్ లా అండ్ పాలసీ అనే బ్లాగ్‌లో ఓ అధ్యయనం పేర్కొంది. జూలై 14వ తేదీ, అంతకముందు.. కర్ణాటకలోని బెంగళూరులో సిటీ ఫైబర్‌నెట్‌ ద్వారా వెబ్‌సైట్ ప్రాప్యతను పరిశోధకులు పరీక్షించారు. టిక్‌టాక్, యుసీ బ్రౌజర్, హలో, లైక్ వంటి కొన్ని వెబ్‌సైట్లు పూర్తిగా బ్యాన్ చేయబడ్డాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం పూర్తిగా పని చేస్తున్న తొమ్మిది వెబ్‌సైట్ల లిస్టును పరిశోధకులు జాతీయ మీడియాతో పంచుకున్నారు. అవన్నింటిని కూడా ఓ వెబ్ బ్రౌజర్‌తో ఢిల్లీలోని స్థానిక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISPలు)ను ఉపయోగించి యాక్సెస్ చేసుకునే వీలుందని తెలిపారు. అయితే, ఇతర ISPలను ఉపయోగించినప్పుడు ప్రాప్యతలో కొన్ని తేడాలు ఉండవచ్చునని చెప్పారు.

ఇక అధ్యయనం ప్రకారం, అందుబాటులో ఉన్న 26 వెబ్‌సైట్లలో, నాలుగు యాప్స్ మాదిరిగానే పూర్తి సామర్ధ్యాన్ని సంపాదించినట్లు తెలుస్తోంది. “ఈ వెబ్‌సైట్‌లలో ఐదు డెస్క్‌టాప్‌ వెర్షన్స్‌కు పూర్తి కార్యాచరణను మర్చుకోగా.. మరో పదకొండు.. పరిమిత కార్యాచరణను కొనసాగిస్తూ.. యూజర్లకు అందుబాటులో ఉంటున్నాయి. అయితే వీటిలో ఆరు మాత్రమే మళ్లీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే వీలుగా దిశానిర్దేశం చేస్తున్నాయి. దీనితో పలు వెబ్‌సైట్ల ద్వారా 20 అప్లికేషన్లు ఇప్పటికీ పూర్తిగా లేదా పాక్షికంగా పనిచేస్తున్నాయి.

Also Read:

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు.. జగన్ సర్కార్ సంచలనం..

”వందేళ్ల జీవితం మార్కుల కంటే విలువైనది”.. ఐఏఎస్ సూపర్బ్ ట్వీట్..

మానవత్వాన్ని చాటుకున్న వైసీపీ ఎమ్మెల్యే.. ప్రశంసించిన స్థానికులు..