New Year 2021 : ట్రెండ్‌కు తగ్గట్లుగా మారిపోతున్న హరిదాసులు..నడక పోయింది..బైక్ వచ్చింది..చిడతలు పోయి..

|

Dec 31, 2020 | 9:30 PM

సంక్రాంతి సందడి మొదలైంది. మూడ్రోజుల ముచ్చటైన ముగ్గుల పండగలో 'హరిలో రంగ హరీ' అంటూ చిడతలు వాయిస్తూ హరిదాసులు చేసే హడావిడి అంతా ఇంతాకాదు.

New Year 2021 : ట్రెండ్‌కు తగ్గట్లుగా మారిపోతున్న హరిదాసులు..నడక పోయింది..బైక్ వచ్చింది..చిడతలు పోయి..
Follow us on

సంక్రాంతి సందడి మొదలైంది. మూడ్రోజుల ముచ్చటైన ముగ్గుల పండగలో ‘హరిలో రంగ హరీ’ అంటూ చిడతలు వాయిస్తూ హరిదాసులు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. అలాంటి హరిదాసులు ట్రెండ్‌ మార్చేసారు. టెక్నాలజీకి అనుగుణంగా మారిపోయారు. నయాగెటప్‌లో ఇప్పుడు ఇలా దర్శనమిస్తున్నారు హరిదాసులు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో నిండైన వస్త్రధారణతో చేతిలో చిడతలు వాయిస్తూ హరినామ కీర్తనలు ఆలపిస్తూ తలపై అక్షయపాత్రను ధరించి ప్రతీయేటా సంక్రాంతి మాసం ప్రారంభం ధనుర్మాసంలో వారు రావడం ఆనవాయితీగా వస్తోన్న సంప్రదాయం. అయితే, కాలంతో పాటు వచ్చిన మార్పులకు హరిదాసులు కూడా ట్రెండ్ మార్చారు. కాలినడకన వచ్చే హరిదాసులు ఇప్పుడు వెరైటీ వాహనాలను వాడుతూ ట్రెండ్‌ సెట్‌చేస్తున్నారు.

కోనసీమలోని పలు ప్రాంతాల్లో హరిదాసులు వెరైటీ వాహనాలపై తిరుగుతున్నారు. చిడతలు వాయిస్తూ పాడే హరినామ కీర్తనలకు బదులు ఇప్పుడు టేపురికార్డుల్లో పాటలు పెడుతూ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు.  అయితే, నడిచి వెళ్లకుండా ఇలా ఎందుకు వెళ్తున్నారు అని అడిగితే వయస్సు మీద పడటంతో నడవలేకపోతున్నామని, ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని వదలలేక ఇలా తిరుగుతున్నామని హరిదాసులు చెపుతున్నారు.

Also Read :

lso Read :

Hyderabad News : కూకట్‌పల్లిలో విషాదం.. కోతిని గద్దించేందుకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

Crime News : దొంగతనం చేసి సినిమా స్టైల్లో కథ అల్లింది..స్క్రీన్ ప్లే అయితే చింపేసింది..పోలీసులు షాక్

Drink and Drive : తాగి వాహనం నడిపితే కాలేజీలకు లేఖలు…విద్యార్థులకు సీపీ సజ్జనార్ వార్నింగ్…

Corona vaccine dry run : వ్యాక్సిన్ రిహార్సల్స్.. జనవరి 2న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో డ్రైరన్..