Google Maps: సరికొత్త హంగులతో వస్తోన్న గూగుల్ మ్యాప్స్… తెలుగుతో పాటు మరో 9 భాషల్లో..

New Features In Google Maps: ఒకప్పుడు ఏదైనా తెలియని ప్రదేశానికి వెళితే.. చేతిలో ఒక చీటితో ‘ఈ అడ్రస్ ఎక్కడో తెలుసా’.. అంటూ దారిన కనిపించే వారిని అడిగేవారు. మరిప్పుడు కాలం మారిపోయింది...

Google Maps: సరికొత్త హంగులతో వస్తోన్న గూగుల్ మ్యాప్స్... తెలుగుతో పాటు మరో 9 భాషల్లో..
Follow us

|

Updated on: Jan 27, 2021 | 8:57 PM

New Features In Google Maps: ఒకప్పుడు ఏదైనా తెలియని ప్రదేశానికి వెళితే.. చేతిలో ఒక చీటితో ‘ఈ అడ్రస్ ఎక్కడో తెలుసా’.. అంటూ దారిన కనిపించే వారిని అడిగేవారు. మరిప్పుడు కాలం మారిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ అందులో గూగుల మ్యాప్స్. ఎక్కడి వెళ్లాలో లైవ్ లొకేషన్ ఉంటే చాలు ఎంచక్కా వాయిస్ కామాండ్స్‌తో సహా తీసుకెళుతోంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో వినియోగదారుడిని ఆకట్టుకుంటోంది కాబట్టే గూగుల్ మ్యాప్స్‌కు అంత క్రేజ్. ఇదిలా ఉంటే యూజర్‌ను మరింత ఆకట్టుకోవడానికి గూగుల్ మ్యాప్స్ సరికొత్త హంగులను జోడించనుంది. ఈ క్రమంలోనే వాయిస్ కమాండ్స్ ద్వారా ప్రదేశాలను గుర్తించే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది కేవలం ఇంగ్లిష్‌లోనే కాకుండా.. కన్నడ, మళయాళం, పంజాబీ, మరాఠీ, తమిళం, హిందీ, తెలుగు, బంగ్లా, గుజరాతీ, ఒడియా భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో యూజర్ వాయిస్ కమాండ్ల ద్వారా ఏదైనా ప్రదేశాన్ని అడిగితే చాలు గూగుల్ దారి చూపించేస్తోంది. ఇందులో భాగంగానే మ్యాప్స్ యాప్‌లో కొత్తగా లక్షల సంఖ్యలో ప్రముఖ ప్రదేశాలను చేర్చారు. దీంతో సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్లు, దుకాణాలు, బస్టాపులు వంటి ప్రదేశాలను చాలా సులభంగా తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు.

Also Read: SpaceX 143 Satellites: ఇస్రో రికార్డ్ ను బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ ను సృష్టించిన స్పేస్‌ఎక్స్.. 143 శాటిలైట్లు లాంఛ్