AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తక్కువ ధరకే అమ్ముడు పోయిన పాప్ స్టార్ నెవర్ ల్యాండ్ ఎస్టేట్.. ఆ ఆరోపణలే కారణమా.?

పాప్ సామ్రాజ్యానికి రారాజుగా ఎదిగిన మైకెల్ జాక్సన్ 2009 జూన్ 25న అనుమానస్పద రీతిలో మరణించిన విషయం తెలిసిందే. ఈ పాప్ కింగ్ బతికున్ననన్ని రోజులు కాలిఫోర్నియాలోని నెవర్ ల్యాండ్ ఎస్టేట్‌లో జీవనం సాగించాడు.

తక్కువ ధరకే అమ్ముడు పోయిన పాప్ స్టార్ నెవర్ ల్యాండ్ ఎస్టేట్.. ఆ ఆరోపణలే కారణమా.?
Narender Vaitla
|

Updated on: Dec 25, 2020 | 5:45 PM

Share

Michael Jackson’s Neverland Ranch sold: పాప్ సామ్రాజ్యానికి రారాజుగా ఎదిగిన మైకెల్ జాక్సన్ 2009 జూన్ 25న అనుమానస్పద రీతిలో మరణించిన విషయం తెలిసిందే. ఈ పాప్ కింగ్ బతికున్ననన్ని రోజులు కాలిఫోర్నియాలోని నెవర్ ల్యాండ్ ఎస్టేట్‌లో జీవనం సాగించాడు. జాక్సన్ ఈ ఇంటిని ఎంతో అభిమానించేవాడు. సుమారు 2700 ఎకరాల్లో ఉన్న ఈ ఎస్టేట్‌ను అతని అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దుకున్నాడు. ఇదిలా ఉంటే జాక్సన్ మరణించిన తర్వాత ఈ ఎస్టేట్‌ను థామ‌స్ క్యాపిట‌ల్ ఇన్వెస్ట్‌మెంట్ 23 మిలియ‌న్ల డాలర్లకు సొంతం చేసుకుంది. తాజాగా నెవర్ ల్యాండ్‌ను అమెరికాకు చెందిన బిలియనీర్ రాబ్ బర్క్లే కొనుగోలు చేశారు. ఈ ఎస్టేట్ సుమారు 22 మిలియన్ల డాలర్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. నిజానికి 2015లో ఈ ఎస్టేట్‌ను వంద మిలియన్ల డాలర్లకు అమ్మేందుకు ప్రయత్నాలు జరిగాయి.. కానీ బర్ల్కే ఇప్పుడు కేవలం 22 మిలియన్ల డాలర్లకే కొనుగోలు చేయడం గమనార్హం. ఇక మైకేల్ ఈ ఎస్టేట్‌లోనే చిన్న పిల్లలపై లైంగిక దాడికి దిగాడని అప్పట్లో ఆరోణలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మైకేల్ మరణించిన తర్వాత ఈ ఇంటిలో దెయ్యంలా తిరిగాడని కూడా అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. వీటి కారణంగానే ఈ ఎస్టేట్ తక్కువ ధరకు అమ్ముడుపోయిందని ఓ ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ ఎస్టేట్‌ను మైకేల్ 1980వ దశకంలో 20 మిలియన్ల డాలర్లకు ఖరీదు చేశాడు.

Follow Us
పిచ్చి పీక్స్.. వ్యూస్ కోసం ట్రైన్‌లో యువకుడు చేసింది చూస్తే..
పిచ్చి పీక్స్.. వ్యూస్ కోసం ట్రైన్‌లో యువకుడు చేసింది చూస్తే..
బ్యాంక్ అకౌంట్లో్ అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఇబ్బందులే..
బ్యాంక్ అకౌంట్లో్ అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఇబ్బందులే..
ఇదేం మ్యాజిక్ భయ్యా.. మన తెలుగోడి స్కిల్‌కు ఎవరైనా ఫిదా..
ఇదేం మ్యాజిక్ భయ్యా.. మన తెలుగోడి స్కిల్‌కు ఎవరైనా ఫిదా..
ఈ నెలలోనే తొలి ఏకాదశి.. వీరికి ఆ రోజున మహర్దశ పట్టబోతోంది..
ఈ నెలలోనే తొలి ఏకాదశి.. వీరికి ఆ రోజున మహర్దశ పట్టబోతోంది..
పూజలో నేలపై కూర్చోవచ్చా? ఆసనం లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది?..
పూజలో నేలపై కూర్చోవచ్చా? ఆసనం లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది?..
'Wiproలో లేఆఫ్.. అది దేవుడిచ్చిన వరం' మాజీ ఉద్యోగిని వీడియో వైరల్
'Wiproలో లేఆఫ్.. అది దేవుడిచ్చిన వరం' మాజీ ఉద్యోగిని వీడియో వైరల్
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..
Green Tea Vs Black Tea: వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్‌కు ఏది బెస్ట్
Green Tea Vs Black Tea: వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్‌కు ఏది బెస్ట్
ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నారా..? మొదట ఈ విషయాలు తెలుసుకోండి..
ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నారా..? మొదట ఈ విషయాలు తెలుసుకోండి..
గ్యాస్ సిలిండర్ పోతే కనెక్షన్ కట్ అవుతుందా..?
గ్యాస్ సిలిండర్ పోతే కనెక్షన్ కట్ అవుతుందా..?