ఫోన్ కొట్టు మ్యాంగో పట్టు.. సూపర్ రెస్పాన్స్

తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ ఇటీవల ప్రవేశపెట్టిన ‘‘ఫోన్ కొట్టు.. మ్యాంగో పట్టు..’’ ఆఫర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎవరికైనా సహజసిద్ధంగా పండించిన.. అంతే సహజంగా మగ్గబెట్టిన మామిడి పళ్ళు కావాలంటే...

  • Rajesh Sharma
  • Publish Date - 5:46 pm, Mon, 4 May 20
ఫోన్ కొట్టు మ్యాంగో పట్టు.. సూపర్ రెస్పాన్స్

తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ ఇటీవల ప్రవేశపెట్టిన ‘‘ఫోన్ కొట్టు.. మ్యాంగో పట్టు..’’ ఆఫర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎవరికైనా సహజసిద్ధంగా పండించిన.. అంతే సహజంగా మగ్గబెట్టిన మామిడి పళ్ళు కావాలంటే.. కాల్ చేయాలంటూ రెండు ఫోన్ నెంబర్లను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టింది. వారం క్రితం ఇంట్రడ్యూస్ చేసిన ఈ స్కీం చక్కని ప్రజాదరణ చూరగొంటోంది.

కేటాయించిన రెండు ఫోన్ నెంబర్లకు నిర్ణీత సమయంలో వందలాది ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మామిడి పళ్ళను కొనుగోలు చేసేందుకు జంటనగరాల ప్రజలు పెద్ద ఎత్తున మొగ్గు చూపుతున్నారు. అయితే తరచూ ఈ ఫోన్ నెంబర్లు బిజీగా వస్తున్నాయని, కొన్ని సార్లు ఫోన్ కలిసినా కూడా పేమెంట్ దగ్గరికి వచ్చేసరికి కట్ అయిపోతున్నాయని ఫిర్యాదులు రావడంతో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మరికొన్ని చర్యలు తీసుకుంది.

మే రెండవ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా బంగినపల్లి తదితర మామిడి పళ్ళను విక్రయించేందుకు ఏర్పాటు చేసింది. tfresh.org అనే వెబ్ సైట్ ద్వారా మామిడి పళ్ళను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది ఆన్ లైన్ ద్వారా మామిడిపళ్ళ విక్రయానికి చర్యలు తీసుకున్న తొలిరోజే 254 మంది ఆన్లైన్ ద్వారా మామిడి పండ్లను బుక్ చేశారు. సుమారు 2094 కిలోల మామిడి పళ్ళు తొలి రోజే ఆర్డర్ వచ్చిందని హార్టికల్చర్ అధికారులు వెల్లడించారు. బుక్ చేసిన తర్వాత నాలుగు లేదా ఐదు రోజుల్లో మామిడి పళ్ళను వారు పేర్కొన్న చిరునామాలకు పంపుతున్నామని అధికారులు వివరించారు. త్వరలోనే ఈ వెబ్సైట్ ద్వారా సహజ సిద్ధంగా పండించిన కూరగాయలు, ఇతర పళ్లను కూడా విక్రయిస్తామని వారు తెలిపారు.