కరోనావైరస్ లాక్‌డౌన్.. 80 కిలోమీటర్లు.. 36 గంటలు..

కోవిద్ 19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ వైపు మండుటెండలు.. మరోవైపు నిత్యావసర వస్తువుల కోసం వచ్చే వారు మినహా ఎవరూ కూడా

కరోనావైరస్ లాక్‌డౌన్.. 80 కిలోమీటర్లు.. 36 గంటలు..
Follow us

| Edited By:

Updated on: Mar 25, 2020 | 5:17 PM

Coronavirus Lockdown: కోవిద్ 19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ వైపు మండుటెండలు.. మరోవైపు నిత్యావసర వస్తువుల కోసం వచ్చే వారు మినహా ఎవరూ కూడా రోడ్ల మీద కనిపించవద్దంటూ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్. విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం విదితమే.

భారత్ లో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. అయితే ఈ లాక్‌డౌన్ 20 సంవత్సరాల అద్వేశ్ కుమార్ అతనితో పని చేసే కూలీలకు మాత్రం శాపంగా మారింది. ఎక్కడ చూసిన పోలీసుల బందోబస్తు.. కాలు కదిపి బయటపెట్టే పరిస్థితి కూడా లేదు. కానీ, అద్వేశ్ మాత్రం తన స్వగ్రామానికి ఎట్టి పరిస్థితుల్లో చేరుకోవాలని దృఢ సంకల్పం చేసుకున్నాడు. అనుకున్నదే తడవుగా అతనితో పాటు పని చేసే 20 మందితో కలిసి అతను పని చేస్తున్నా ఉన్నావ్ గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించాడు.

కాగా.. దాదాపు 80 కిలోమీటర్ల పాటు సాగే ఈ ప్రయాణాన్ని అతను మంగళవారం సాయంత్రం ప్రారంభించాడు. పోలీసులు అడ్డుకోకుంటే.. అది కాకుండా ఎటువంటి అవాంతరం ఏర్పడకుంటే.. అతను తన స్వగ్రామం బారాబంకి చేరుకొనేందుకు దాదాపు 36 గంటల సమయం పడుతుంది. స్టీల్ ఫ్యాబ్రికేషన్ కంపెనీలో పని చేస్తున్న అద్వేశ్‌ను తన పరిస్థితి గురించి ప్రశ్నించగా.. ‘‘ఇక్కడ నేను ఉండలేను. నన్ను ఏం చేయమంటారు.. ఇది నాకు తప్పని పరిస్థితి. గత రాత్రి నన్ను వెళ్లిపొమ్మిని యాజమాన్యం కచ్చితమైన ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి నాకు ఇంటికి వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. రవాణా సౌకర్యం లేదు. దీంతో మా ఊరి వాళ్లంతా కలిసి నడిచి వెళ్దామని నిర్ణయించుకున్నాము’’ అని తెలిపాడు.