అలర్ట్: ఏపీ మోడల్‌ స్కూల్‌ ప్రవేశాలకు.. రెండు రోజులే గడువు..

| Edited By:

Jul 23, 2020 | 3:08 PM

కరోనా సంక్షోభ సమయంలో కూడా ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు. కాగా.. ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. జూలై 6న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

అలర్ట్: ఏపీ మోడల్‌ స్కూల్‌ ప్రవేశాలకు.. రెండు రోజులే గడువు..
AP-model-school-admissions
Follow us on

కరోనా సంక్షోభ సమయంలో కూడా ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు. కాగా.. ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. జూలై 6న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల విద్యార్థులు https://apms.apcfss.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 25న ముగుస్తుంది. 2019-20 విద్య సంవత్సరంలో 5వ తరగతి చదివిన విద్యార్థులు మాత్రమే అర్హులు. ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్ కాకుండా లాటరీ ద్వారా అడ్మిషన్లు కల్పించనున్నారు.

Also Read: ఎంట్రెన్స్‌ పరీక్షలు రద్దు.. డీమ్డ్‌ వర్సిటీలకు డిమాండ్..