కేరళ స్థానిక ఎన్నికల్లో దూసుకువెళ్తున్న పాలక ఎల్డీఎఫ్, 520 గ్రామ పంచాయతీల్లో ఆధిక్యం

కేరళలో జరిగిన స్థానిక ఎన్నికల్లో పాలక ఎల్ డీ ఎఫ్ అత్యధిక స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతోంది. వచ్ఛే ఏడాది రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు దీన్ని 'లిట్మస్ టెస్ట్' గా భావిస్తున్నారు. అవినీతి ఆరోపణలు వఛ్చినప్పటికీ లెఫ్ట్ డెమొక్రాట్ ఫ్రంట్..

కేరళ స్థానిక ఎన్నికల్లో దూసుకువెళ్తున్న పాలక ఎల్డీఎఫ్, 520 గ్రామ పంచాయతీల్లో ఆధిక్యం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 16, 2020 | 8:16 PM

కేరళలో జరిగిన స్థానిక ఎన్నికల్లో పాలక ఎల్ డీ ఎఫ్ అత్యధిక స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతోంది. వచ్ఛే ఏడాది రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు దీన్ని ‘లిట్మస్ టెస్ట్’ గా భావిస్తున్నారు. అవినీతి ఆరోపణలు వఛ్చినప్పటికీ లెఫ్ట్ డెమొక్రాట్ ఫ్రంట్ కి అనేక చోట్ల ఆధిక్యత లభించడం విశేషం. గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి కేరళ పతాక వార్తలకెక్కినా ఓటర్లు దీన్ని పట్టించుకోనట్టు కనిపిస్తోంది. 945 గ్రామ పంచాయతీలకు గాను 520 పంచాయతీలలో ఎల్ డీ ఎఫ్ ఆధిక్యతలో ఉండగా, విపక్ష కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీ ఎఫ్ 371 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. 14 జిల్లా పంచాయతీలకు గాను 10 పంచాయతీలను ఎల్ డీ ఎఫ్ గెలుచుకుంది. యూడీఎఫ్ నాలుగు పంచాయతీలకే పరిమితమైంది. అయితే 86 మున్సిపాలిటీలకు గాను యూ డీ ఎఫ్ 45 చోట్ల ఆధిక్యంలో ఉండగా లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ 35 చోట్ల లీడింగ్ లో ఉంది.

తిరువనంతపురం పై ఆశలు పెట్టుకున్న బీజేపీ నీరుగారిపోయింది. ముక్కోణ పోటీలో ఈ పార్టీ కాంగ్రెస్ ను మూడో స్థానానికి పరిమితం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇక్కడ ఎల్ డీ ఎఫ్ హవా వీస్తోంది. అనేక వార్డుల్లో గెలిచిన అభ్యర్థులు తమ మద్దతుదారులతో చేస్తున్న హంగామా ఇంతాఅంతా కాదు. విజేతలైన మహిళా అభ్యర్థులు కూడా హర్షాతిరేకంతో తమ సపోర్టర్లతో విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

Latest Articles