Karthika Deepam: వంటలక్క ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ సినిమాతోనే ‘దీప’ వెండితెర ఎంట్రీ.!

|

Feb 29, 2020 | 2:32 PM

సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ప్రేమి విశ్వనాధ్.. సినిమాల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఆమె మలయాళంలో 'సాల్మన్' అనే మూవీతో వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఇందులో భాగంగా షూట్ టైం‌లో నటుడు రాజివెట్టన్‌తో కలిసి దిగిన ఫోటోలను ఆమె తన ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు...

Karthika Deepam: వంటలక్క ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ సినిమాతోనే దీప వెండితెర ఎంట్రీ.!
Follow us on

Karthika Deepam Serial: తినగతినగ వేము తియ్యనుండు.. చూడగ చూడగా కార్తీకదీపం అద్భుతంగానుండు.. విశ్వదాభిరామ.. సీరియల్స్‌నందు కార్తీకదీపం వేరురా మామ..! ఆడామగ అనే తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరిని కట్టిపడేసే సీరియల్ ఇది. రాత్రి 7.30 గంటలు అయితే చాలు ప్రతీ ఒక్కరూ టీవీలకు అతుక్కుపోతారు. అంతేకాదు వంటలక్క క్రేజ్ ముందు స్టార్ హీరోల హిట్టు సినిమాలు కూడా పోటీపడలేకపోతున్నాయి. ఇక ఈ సీరియల్ మెయిన్ రోల్ దీప పాత్రలో నటించిన నటి ప్రేమి విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జాతీయ స్థాయిలో ‘కార్తీకదీపం’ అద్భుతంగా ఆదరణ పొందుతోందంటే దానికి ప్రధాన కారణం ఆమె అనడంలో సందేహం లేదు.

వంటలక్కగా ప్రేమి నటన అందరిని కట్టిపడేస్తోంది. ఆమె నటన సీరియల్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇక కన్నడంలో కారుతుముత్తు సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ప్రేమి విశ్వనాధ్ పలు గేమ్ షోలకు కూడా హోస్టుగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈమె నటిస్తున్న తొలి చిత్రం గురించి ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ప్రేమి విశ్వనాధ్.. సినిమాల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఆమె మలయాళంలో ‘సాల్మన్’ అనే మూవీతో వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఇందులో భాగంగా షూట్ టైం‌లో నటుడు రాజివెట్టన్‌తో కలిసి దిగిన ఫోటోలను ఆమె తన ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. అవి కాస్తా వైరల్ కావడమే కాకుండా ఫ్యాన్స్ ఆమెకు బెస్ట్ విషెస్ కూడా తెలియజేస్తున్నారు.

For More News: 

అలెర్ట్: మార్చిలో ఏకంగా 19 రోజులు బ్యాంకుల సేవలు బంద్…

అక్కడ కరోనా ఉన్నట్లు రుజువైతే లక్ష ఇస్తారట.. ఎందుకంటే..

విద్యాసంస్థల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్…

కోహ్లీకి అసలు ఏమైంది.?