Breaking… నిర్భయ దోషులకు ఉరి అమలు…

|

Mar 20, 2020 | 2:14 PM

Justice For Nirbhaya: ఏడేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరి పడింది. ఇవాళ ఉదయం 5.30 గంటలకు తీహార్ జైలులో దోషులైన అక్షయ్ ఠాకూర్, ముకేశ్ సింగ్, పవన్ గుప్త, వినయ్ కుమార్ లను ఉరి తీశారు. జైలు నెంబర్ 3లో వాళ్లను ఉరి తీసేటప్పుడు ఉరికంబం దగ్గర 48 సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. ఇప్పటివరకు న్యాయవ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్‌ను ఉపయోగించుకుని ఈ నలుగురు ఉరిశిక్ష నుంచి తప్పించుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే. […]

Breaking... నిర్భయ దోషులకు ఉరి అమలు...
Follow us on

Justice For Nirbhaya: ఏడేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరి పడింది. ఇవాళ ఉదయం 5.30 గంటలకు తీహార్ జైలులో దోషులైన అక్షయ్ ఠాకూర్, ముకేశ్ సింగ్, పవన్ గుప్త, వినయ్ కుమార్ లను ఉరి తీశారు. జైలు నెంబర్ 3లో వాళ్లను ఉరి తీసేటప్పుడు ఉరికంబం దగ్గర 48 సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు.

ఇప్పటివరకు న్యాయవ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్‌ను ఉపయోగించుకుని ఈ నలుగురు ఉరిశిక్ష నుంచి తప్పించుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే. దోషులకు ఉరి పడటంతో నిర్భయ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేయగా.. తీహార్ జైలు వద్ద సంబరాలు మిన్నంటాయి.

మీరట్ కు చెందిన పవన్ జల్లాడ్ తలారిగా వ్యవహరించి ఈ నలుగురికి ఒకేసారి ఉరిని అమలు చేశాడు. దీనికి అతడికి 15,000 రూపాయలు ముట్టజెప్పారు. కాగా, నలుగురు దోషులకు ఉరి వేసే సమయంలో పవన్‌తో పాటు జైలు డాక్టర్ కూడా ఉన్నారు. కాగా, నిర్భయ ఘటన జరిగిన 7 సంవత్సరాల 3 నెలల 4 రోజులకు దోషులకు ఉరి పడింది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడైన రామ్ సింగ్ తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకోగా.. మైనర్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడిన సంగతి విదితమే.

For More News:

నిర్భయ ‘ఆశ’ల పోరాటానికి హ్యాట్సాఫ్..!

నిర్భయ తరపు న్యాయవాది ఫీజు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

నా కుమార్తె ఫొటోను కౌగలించుకున్నా: నిర్భయ తల్లి భావోద్వేగం

వారిని కాదు.. నిర్భయ తల్లిని శిక్షించాలట.. దోషుల తరపు లాయర్

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే

కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్…

Breaking: ఏపీలో రెండో కరోనా పాజిటివ్ కేసు..

కరోనా భయం.. తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు వేల కోళ్లు సజీవ సమాధి..