పోలీసు శాఖలో విషాదం : కోవిడ్ సోకి ఎస్సై మృతి

|

Jul 31, 2020 | 1:10 PM

క‌రోనా వ్యాప్తి ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ముందుండి ప‌నిచేస్తోన్న పోలీసు శాఖ‌ను వైర‌స్ క‌ల‌వ‌ర‌పెడుతోంది. తాజాగా కోవిడ్-19 ఈ శాఖ‌లో మ‌రో ప్రాణాన్ని బ‌లి తీసుకుంది.

పోలీసు శాఖలో విషాదం : కోవిడ్ సోకి ఎస్సై మృతి
Follow us on

Police died of Covid-19 : క‌రోనా వ్యాప్తి ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ముందుండి ప‌నిచేస్తోన్న పోలీసు శాఖ‌ను వైర‌స్ క‌ల‌వ‌ర‌పెడుతోంది. తాజాగా కోవిడ్-19 ఈ శాఖ‌లో మ‌రో ప్రాణాన్ని బ‌లి తీసుకుంది. కరోనా బారిన పడిన జోగిపేట ఎస్సై ప్రభాకర్ ప్రాణాల విడిచారు. ఐదు రోజుల క్రితం క‌రోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన గచ్చిబౌలిలోని ఓ ప్రవేట్ ఆస్ప‌త్రిలో చేర్పించారు. అయితే అక్క‌డ వెంటిలేట‌ర్లు స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోవ‌డంతో వేరే ఆస్ప‌త్రికి తీసుకెళ్లాల‌ని సూచించారు. దీంతో బంజారాహిల్స్‌లోని విరించి ఆస్ప‌త్రికి ఎస్సై ప్రభాకర్ ను తీసుకెళ్ల‌గా.. అక్క‌డ అడ్మిట్ చేసుకోలేదు. అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

Read More : రివ్యూ: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య

కాగా ప్రభాకర్ స్వస్థ‌లం నారాయణఖేడ్ మండలంలోని సత్యగామ. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇక జోగిపేటలో ఇంటెలిజెన్స్ లో ఏఎస్సైగా వ‌ర్క్ చేసిన చాకలి వెంకటేశ్ ఇటీవ‌ల‌ కరోనాతో చ‌నిపోయారు. ఇక ఆటల పోటీల కారణంగా మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంట‌ర్లో 54 మంది కానిస్టేబుళ్లకు కోవిడ్ సోకింది.

 

Read More : గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు షాక్ : సబ్సిడీ డబ్బులు బంద్ !