ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. డిసెంబర్ 25న ఇళ్ల స్థలాల పంపిణీ..!

|

Nov 18, 2020 | 4:37 PM

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. డిసెంబర్ 25వ తేదీన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించింది.

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. డిసెంబర్ 25న ఇళ్ల స్థలాల పంపిణీ..!
Follow us on

Jagan Government: ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. డిసెంబర్ 25వ తేదీన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించింది. హైకోర్టు స్టే ఇచ్చిన ప్రాంతాలు మినహాయించి.. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన అన్ని ప్రదేశాల్లో ఇళ్ల స్థలాల పంపిణీని చేపట్టనుంది. లబ్ధిదారులకు డి-ఫామ్ పట్టా ఇవ్వడం ద్వారా ఇంటి స్థలాన్ని కేటాయించనున్నారు. కాగా, ఏపీ వ్యాప్తంగా ఇప్పటివరకు 30,68,281 మంది లబ్దిదారులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇక డిసెంబర్ 25వ తేదీనే ఇళ్ల నిర్మాణాలను కూడా మొదలుపెట్టనున్నట్లు తెలిపింది. తొలి దశలో భాగంగా 15 లక్షల ఇళ్లను నిర్మించనుంది. కాగా, గతంలో వివిధ కారణాల వల్ల ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read:

ఐపీఎల్ 2021: మారనున్న టీమ్స్ రూపురేఖలు.. మెగా ఆక్షన్‌లోకి ధోని, స్మిత్, విలియమ్సన్‌లు వచ్చే అవకాశం..

ధోనిని వదులుకోవడమే బెటర్.. సీఎస్‌కేకు ఆకాష్ చోప్రా ఉచిత సలహా..!

‘వైఎస్సార్ సున్నా వడ్డీ పధకం’.. వారికి మరో అవకాశాన్ని కల్పించిన జగన్ సర్కార్.!