Ind Vs Sl 1st Test, Day2: రవీంద్ర జడేజా అజేయ సెంచరీ ( 175 నాటౌట్: 17 ఫోర్లు, 3 సిక్స్‌లు), రవిచంద్రన్ అశ్విన్ (61 పరుగులు, 21/2) ఆల్‌రౌండ్ ప్రతిభతో మొహాలీలో శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో టీమిండియా పట్టుబిగించింది. శనివారం జడ్డూ రికార్డ్ సెంచరీతో టీమిండియా 574/8 వద్ద తన తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన లంకేయులను టీమిండియా బౌలర్లు దెబ్బతీశారు. వరుస విరామాల్లో వికెట్లు తీశారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో నిశాంక (26), అసలంక (1) ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ 2.. బుమ్రా, జడేజా చెరో వికెట్ తీశారు. భారత జట్టు కంటే లంక ఇంకా 466 పరుగులు వెనకబడి ఉంది.
జడేజా కీలక భాగస్వామ్యాలు..
ఓవర్‌నైట్ స్కోరు 357/6తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు రవీంద్ర జడేజా, అశ్విన్ సెంచరీ భాగస్వామ్యం (130) నిర్మించారు. ఈ క్రమంలో జడేజా సెంచరీ, అశ్విన్ అర్ధశతకం పూర్తి చేసుకున్నారు. అయితే అర్ధ సెంచరీ పూర్తి చేసిన తర్వాత అశ్విన్ మరింత దూకుడుగా ఆడే యత్నంలో అక్మల్ షార్ట్‌పిచ్ బంతికి కీపర్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత జయంత్ యాదవ్ (2) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. అయితే షమీ (20 నాటౌట్) సహాయంతో జడేజా తన దూకుడును కొనసాగించారు. వీరిద్దరూ కలిసి వంద పరుగుల (103) భాగస్వామ్యం నిర్మించారు. ఈ క్రమంలో 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన రవీంద్ర జడేజా ఏడో స్థానంలో దిగి అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. రెండో సెషన్ టీ బ్రేక్ సమయానికి కెప్టెన్ రోహిత్ శర్మ భారత ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన శ్రీలంకకు ఓపెనర్లు దిముత్ కరుణరత్నె (28), లహిరు తిరిమన్నె (17) శుభారంభం అందించారు. మొదటి వికెట్‌కు 48 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరి వెంటవెంటనే పెవిలియన్‌కు పంపించారు అశ్విన్, జడేజా. మరోవైపు నిశాంకతో కలిసి సీనియర్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ (22) ఆచి తూచి ఆడాడు. అయితే బుమ్రా వేసిన ఓ అద్భుతమైన బంతికి మాథ్యూస్ వికెట్ల ముందు దొరికిపోయాడు. సమీక్షకు వెళ్లినా మాథ్యూస్ నిరాశ ఎదురైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన డిసిల్వా (1)ను అశ్విన్ ఎల్బీగా ఔట్ చేశాడు. కాగా రెండో రోజూ టీమిండియా తీసిన నాలుగు వికెట్లూ ఎల్బీలే కావడం గమనార్హం.
Another commanding day for India comes to an end as bowlers press home the advantage.#WTC23 | #INDvSL | https://t.co/mo5BSRmFq2 pic.twitter.com/VWza9lWTiA
— ICC (@ICC) March 5, 2022
Also Read:LIC Policy: ప్రతి నెల రూ.51,000 పెన్షన్.. ఉన్నన్ని రోజులు భర్తకి.. ఆ తర్వాత భార్యకి పెన్షన్..!
Salmon Fish: సాల్మన్ చేపలు.. రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం.. లెక్కకు మించిన ప్రయోజనాలు